తెలంగాణలో అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నిస్తున్న బీజేపీ.. అక్రమంగా అడ్డదారులు తొక్కుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అడ్డదారులు తొక్కి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని విశ్వ ప్రయత్నలే చేసింది. అధికార టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించగా.. టిఆర్‌ఎస్ కు విధేయత చూపిన ఎమ్మేల్యేలు బీజేపీ ఉచ్చులో పడకుండా..ఆ పార్టీ కుయుక్తులను బహిరంగంగా బయట పెట్టారు. ఇంతటి అధికార దాహంతో ఉన్న బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని అందరికీ తెలుసు.
ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అంటూ పాదయాత్ర చేస్తున్నప్పటికి.. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించినంతా ఆధరణ లభించక పోగా.. ఇంకా వ్యతిరేకత ఎదురవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరుపున రాష్ట్రనికి ఏం నిధులు ఇప్పించవని, రాష్ట్రం తరుపున కేంద్రం నుంచి ఏం అభివృద్ది చేశారని ప్రజలు అడుగుతున్నారు. ఇటీవల ఆయన సొంత ఇలాఖలోనే ప్రజలు పై విధంగా ప్రశ్నించారు. ఇదిలా ఉంచితే ప్రజా సంగ్రామ యాత్ర అయిదవ విడత పాదయాత్ర ముగింపు సభను కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సభలో బండి సంజయ్ కన్నీరు పెట్టుకున్నారు. కరీంనగర్ బీజేపీ కార్యకర్తలే తనను నాయకుడిగా తయారు చేశారని, 2018 లో తను ఓడిపోయానని, తాను ఓడిపోతే కార్యకర్తలు కూడా ఏడ్చరాని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా తను ఓడిపోయినప్పటికి తన కష్టాన్ని గుర్తించి పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు బండి సంజయ్. అయితే బండి సంజయ్ ఇలా కన్నీరు పెట్టుకోవడం కొత్తేమీ కాదు ఆయా సందర్భాల్లో ఆయన కన్నీరు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన మొసలి కన్నీరు ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే.. ప్రజాసేవ కోసం పని చేసే నాయకుడు పదవులు ఆశించడం అరుదు. కానీ బండి సంజయ్ మాత్రం కేవలం బీజేపీ అధిష్టానం మెప్పు పొందేందుకే పని చేస్తున్నాట్లు చాలా సందర్భాల్లో స్పష్టమైంది. ఆ మద్య అమిత్ షా పదాలకు చెప్పులు వేసి తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కేంద్రం పదాల వద్ద పెట్టాడు. ఇక బహిరంగ సభలలో ఆయన మాట్లాడినా ప్రతిసారి అధిష్టానంపై పొగడ్తల వర్షం కురిపిస్తారే తప్పా.. కేంద్రం నెంచి రాష్ట్రనికి రావలసిన నిధుల విషయంలో కేంద్రాన్ని ప్రశించిన సందర్భలే లేవు. ఇక తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని కేంద్రం పదాల వద్ద ఉంచే నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి అసలు లేదనేది అందరికీ తెలిసిన వాస్తవం.
ఇవి కూడా చదవండి…