టార్గెట్ ఏపీ.. కే‌సి‌ఆర్ ప్లాన్ అదే?

110
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కే‌సి‌ఆర్.. ఇక దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతూ బి‌ఆర్‌ఎస్ బలాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అలాగే యూపీ మాజీ సి‌ఎం అఖిలేశ్ యాదవ్ వంటి వారితో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రైతుసంఘాలనేతలు, ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున బి‌ఆర్‌ఎస్ కు మద్దతు పలుతున్నారు. భవిష్యత్ లో మోడీ ఢీ కొట్టి నిలిచే సత్తా ఒక్క కే‌సి‌ఆర్ కు మాత్రమే ఉందని ఆయా నేతలు గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇదిలా ఉంచితే బి‌ఆర్‌ఎస్ జాతీయ పార్టీగా నిలవాలంటే ఆయా రాష్ట్రాలలో పార్టీ బలాన్ని చాటుకోవాలి. దాంతో అధికారిక గుర్తింపు కోసం ఏపీ, కర్నాటక వంటి రాష్ట్రాలపై కే‌సి‌ఆర్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది…

ఏపీ సంగతి అలా ఉంచితే కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో తెలుగువాళ్ళు అధికంగా ఉన్నారు. దాంతో అక్కడి ప్రజలు కూడా బి‌ఆర్‌ఎస్ ను ఆదారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో బి‌ఆర్‌ఎస్ బలపడితే రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని రాష్ట్రాలపై బి‌ఆర్‌ఎస్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ తరువాత కే‌సి‌ఆర్ కు ఆ స్థాయిలో పాపులారిటీ ఏపీలో కూడా ఉంది. తెలంగాణలో ప్రవేశ పెడుతున్న ఆయా పథకాలపై ఏపీ ప్రజల్లో కూడా సానుకూలత ఉంది. దాంతో ఏపీలో బి‌ఆర్‌ఎస్ త్వరగానే బలపడే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పోటీలో నిలుస్తుందా అనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కే‌సి‌ఆర్ కు మంచి సఖ్యత ఉంది. 2019 ఎన్నికల తరువాత వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి కే‌సి‌ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో ఏపీలో బి‌ఆర్‌ఎస్ వైసీపీ తో కలిసే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ ఏ పార్టీతో కలిసే అవకాశం లేకపోయినప్పటికి బి‌ఆర్‌ఎస్ ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉంది. అందుకే ఏపీని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు కే‌సి‌ఆర్. ఇక ఏపీలో బి‌ఆర్‌ఎస్ గ్రాండ్ ఎంట్రీ కోసం ఈ సంక్రాంతికి బి‌ఆర్‌ఎస్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అమరావతిలో ఈ సంక్రాంతికి కే‌సి‌ఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందట. ఏపీలో బి‌ఆర్‌ఎస్ బాద్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ భుజాన వేసుకున్నారు. ఇక ఒక్కసారి ఏపీలో బి‌ఆర్‌ఎస్ అధికారిక ఎంట్రీ ఇచ్చిన తరువాత నాన్ స్టాప్ గా పోలిటికల్ హిట్ పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

ఏపీ బీఆర్ఎస్‌ ఇంఛార్జీగా కీలక నేత!

బి‌ఆర్‌ఎస్ తోనే మార్పు తథ్యం !

ఏపీకి ప్రత్యేక హోదా.. నో ఛాన్స్!

- Advertisement -