త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే ప్రచార కార్యక్రామాలు కూడా చేపట్టాయి. కర్ణాటకలో రెండు జాతీయ పార్టీలు అధికారాన్ని చేజికించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎన్నికలలో నిలబడే అభ్యర్థుల రెండవ జాబితాను బీజేపీ అధిష్ఠానం నిన్న విడుదల చేసింది. అధిష్ఠానం విడుదల జాబితాలలో తన పేరు లేకపోవడంతో బీజేపీ నేత శశిల్ జీ నమోషి బోరున విలపించారు.
అయితే గుల్బర్గా నియోజకవర్గం నుంచి టిక్కెట్ వస్తుందని ఎంతో ఆశతో ఉన్న నాకు టికెట్ ఇవ్వకుండా, సీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వడంతో మీడియా ముందు బోరున ఏడ్చేశారు. తనకు చాలా అన్యాయం జరిగిందని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు.
మరోవైపు కర్ణాటకలో రాజకీయ వేడిమొదలైంది. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కర్ణాటకలో అధికారాన్ని ఏర్పర్చుకుని తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇంకోవైపు ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని చేజికించుకోవాలని ఆరాటపడుతుంది. కాంగ్రెస్‌ని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి ఆ పార్టీ అధ్యక్షుడికి కానుకగా ఇవ్వాలని సీఎం సిద్దారామయ్య భావిస్తున్నారట.