కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం చేస్తాం:లక్ష్మణ్

5
- Advertisement -

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు బీజేపీ ఎంపీ డా.కె లక్ష్మణ్. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు సీఎం ప్రచారం చేయలేదు, కానీ రేవంత్ మాత్రం కోట్లు ఖర్చు చేసి నాలుగు సభల్లో పాల్గొన్న ఫలితం లేదు.. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసి మోదీకి కానుకగా ఇవ్వనున్నాం అన్నారు. ఉగాది తర్వాత వచ్చే నలుగేళ్లకు సంబందించిన ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నాం… గ్రేటర్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరెలా మా కార్యాచరణ ఉండబోతుందన్నారు.

రేవంత్ రెడ్డి కి ఇంటిపోరు ఎక్కువైంది… కేంద్రం నుంచి ఉదారంగా నిధులు ఇస్తున్నాం అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో భాగంగా రాష్ట్రాలకు తగిన విధంగా నిధులు వస్తున్నాయి…10 ఏళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చిన నిధులు, ప్రాజెక్టుల కంటే మా ఎన్డీయే హయాంలోనే ఎక్కువ వచ్చాయి అన్నారు.

స్వయంగా ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ కు మోడీ హయాంలో రైల్వే స్టేషన్ వచ్చింది.. బిల్లులు రాక, కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ధర్నాలు చేసే స్థితిలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది అన్నారు. మూసి ప్రక్షాళన కు మేము కట్టుబడి ఉన్నాం, వ్యతిరేకం కాదు అన్నారు.

కానీ నిర్వాసితులకు న్యాయం చేయాలి… ఉద్యోగులకు 1 న జీతాలు ఇవ్వలేకపోతున్నారు, పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బిఅరెస్ సపోర్ట్ చేసింది.. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కనీసం అభ్యర్థులను పెట్టలేని దుస్థితి లో బిఅరెస్ ఉంది, బిఅరెస్ గడిచిన చరిత్ర అన్నారు. 12 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను నివమించింది, త్వరలోనే తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు.

Also Read:తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే..

- Advertisement -