ఆ పోస్టులు మాకొద్దు బాబోయ్‌..బండిపై అసహనం!

123
- Advertisement -

కోరి తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది కాషాయ నేతల పరిస్థితి. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా తాజాగా మరికొంతమంది కూడా పువ్వు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక తొలి నుండి పార్టీకి సేవలందించిన నేతలు సైతం ఇప్పుడు అలకపాన్పు ఎక్కారు. తమకు అసెంబ్లీ ఇంచార్జ్, కన్వీనర్ల పదవులు వద్దని…ఆ పదవులు నుండి తొలగించాలంటూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖం ముందే తేల్చిచెతున్నారు.

అసెంబ్లీ ఇంచార్జ్‌లు, కన్వీనర్లు ఎన్నికల్లో పోటీ చేయటానికి అవకాశం లేకపోవడంతో తమను పదవి నుంచి తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పార్టీ నేతల విజ్ఞప్తులపై రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక దీనికి తోడు తాము చెప్పిన వారిని అసెంబ్లీ కన్వీనర్లుగా నియమించలేదని పలు జిల్లాల అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న బీజేపీ శిక్షణా తరగతులకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నించిన వినని పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -