టికెట్ ఇవ్వలేదని బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం..

17
BJP Leader Vijayalatha

హైదరాబాదులో బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో టికెట్‌ రాలేదని బీజేపీ నాయకురాలు విజయలలితా రెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. నాచారం డివిజన్‌ బీజేపీ నాయకురాలైన విజయలలితా రెడ్డి నాచారం టికెట్‌ ఆశించారు. టికెట్‌ రాకపోవటంతో మనస్తాపానికి గురయ్యారు.

గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో అనుచరులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తనకు టికెట్‌ రాకుండా చేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్టు సమాచారం.