బిర్యానీ పాట్ @ న్యూజెర్సీ

145
Biryani Pot @ New Jersey

తెలంగాణ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది పొగలు కక్కే హైదరాబాద్ బిర్యానీయే. నిజాం కాలం నుంచీ ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అర్ధరాత్రి పన్నెం డు గంటల దాకా నగర వీధుల్లో ధమ్‌కా బిర్యానీ ఘుమఘుమలు నోరూరిస్తాయి. ప్రపంచ నలుమూలల నుంచి విశ్వనగరానికి వచ్చిన విదేశీయులెవరైనా హైదరాబాద్ ధమ్‌కా బిర్యానీ రుచి చూడకుండా తిరిగి వెళ్లరు.

దమ్ కా బిర్యానీ భాగ్యనగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రెసిపీ. అది అమెరికా అయినా.. బ్రిటన్ అయినా.. జర్మనీ అయినా.. జపాన్ అయినా.. బిర్యానీ తినాలనిపిస్తే హైదరాబాద్ వైపు చూడాల్సిందే. అంతటి ఖ్యాతి గాంచిన హైదరాబాద్ బిర్యానీని అమెరికాలోని సౌతిండియా ప్రజలకు అందించేందుకు మరోకొత్త బ్రాంచ్‌తో ముందుకొచ్చింది బిర్యానీ పాట్. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో14పైగా శాఖలు నెలకొల్పి అతిపెద్ద భారతీయా రెస్టారెంట్ చైన్ గా పిలవబడుతున్న బిర్యానీ పాట్….తాజాగా న్యూజెర్సీలోని ప్రజలను ఆకట్టుకునేందుకు మరో కొత్త బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. పార్సిపన్నే మేయర్ జేమ్స్ బార్బిరియో ఘుమఘుమలాడే ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించగా కౌన్సిల్ పర్సన్ లూయిస్ వెలోరి, బోర్డు డైరెక్టర్‌ దత్తారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Biryani Pot @ New Jersey

బిర్యానీ తో పాటు మరి కొన్ని సంప్రదాయ వంటకాలను కూడా అందిస్తోంది బిర్యానీ పాట్. ఎన్నో వెరైటీలతో స్వచ్ఛమైన ఇంటి రుచులు… ఉత్తమ తయారి విధానం తో ప్రత్యేక మసాలా మేలవంపుతో రెస్టారెంట్ రంగం లోనే నూతన వరవడిని నెలకొల్పింది. కస్టమర్లకు రెస్టారెంట్‌కు వచ్చిన ఫిలింగ్ కలగకుండా…ఇంట్లోని వాతావరణాన్ని తలపించే విధంగా…ప్రత్యేక ఏర్పాట్లతో రుచి కరమైన ఆహారాన్ని అందిస్తోంది. దాదాపు 95 రకాల రుచులతో సేవే ప్రధానంగా ప్రారంభమైన ఈ రెస్టారెంట్ అమెరికా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాన్‌ వెజ్‌తో పాటు వెజిటెరియన్‌ ఆహారాన్ని….భారతీయ వంటకాల రుచులతో అందిస్తోన్న బిర్యానీ పాట్‌ ఘుమఘుమలు నోరూరించాయని కస్టమర్లు అభిప్రాయపడుతున్నారు.

Biryani Pot @ New Jersey