పెళ్లికి రెడీ అవుతున్న బొమ్మాళి..!

729
- Advertisement -

అనుష్క పెళ్లి గురించి టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా రకరకల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి ఎంత వరకు నిజమో తెలియదు…కాని ఇప్పుడు అనుష్కకు నిజంగానే పెళ్లి పిక్స్‌ అయిందట. తమిళ, తెలుగు భాషల్లో అగ్ర నాయకిగా రాణిస్తున్న నటి అనుష్క. 2005లో నటిగా సినీ ఇండస్ట్రీకి రంగప్రవేశం చేసింది. ప్రముఖ కథానాయకులందరితోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 35వ ఏట అనుష్క అడుగుపెడుతుంది. అప్పట్లో ఓ వ్యాపారవేత్తను అనుష్క పెళ్లాడబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే నిజంగానే అనుష్క పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట.

Anushka Shetty marriage with Bengaluru Based Realtor

ఇండస్ట్రీలో ఏజ్ బార్ అవుతున్న పెళ్లి చేసుకోకుండా సినిమాలు మీద సినిమాలు చేస్తోంది ఈ యోగా బ్యూటీ అనుష్క షెట్టి. ఇప్పటికే యంగ్ హీరోల పక్కన అనుష్క అక్కలా మారిందని సోషల్‌ మీడియాల్లో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికి ఈ అమ్మడు సీనియర్ హీరోల సినిమాలకు మాత్రమే కమిట్ అవుతోంది.
ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో జోష్ మీద ఉంది బొమ్మళి. అయితే జేజమ్మకి పెళ్లి కళ వచ్చేసిందట. వీలైనంత త్వరగా అనుష్కకు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట అనుష్క పేరెంట్స్. లేట్ చేస్తున్న కొద్దీ ఏజ్ పెరగడంతో పాటు.. అమ్మడు పై ఎఫైర్ ముచ్చట్లు పెరిగిపోతుండడంతో తొందరగా పెళ్లితో ముడి పెట్టేయాలని చూస్తున్నారట. సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తవ్వగానే అనుష్క పెళ్లి డప్పులు మోగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం అనుష్క తమిళంలో ఎస్-3 చిత్రంలో సూర్యతోనూ, ద్విభాషా చిత్రం బాహుబలి-2, హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం భాగమతి, భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో అనుష్క నటిస్తోంది.

Anushka Shetty marriage with Bengaluru Based Realtor

వీటిలో ఎస్-3 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇలా ఉండగా అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం ఫిల్మ్‌ నగర్‌లో జోరందుకుంది. కారణం ఈ అమ్మడికి కల్యాణ ఘడియలు దూసుకొస్తున్నాయని సమాచారం. అయితే ఇటీవల అనుష్క పెళ్లిపై వదంతులు ఊపందుకున్న తరుణంలో…. నటుడు ఆర్యతో ప్రేమకలాపాలంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఒక తెలుగు నటుడితో డేటింగ్ అంటూ ప్రచారం కూడా హోరెత్తింది. ఇటీవల వివాహితుడైన నిర్మాతను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం కలకలం పుట్టించింది. కాగా వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా అనుష్క కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడంలో వేగం పెంచినట్లు తాజా సమాచారం. అదే విధంగా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లిని నిశ్చయించినట్లు సినీ వర్గాల గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి-2 విడుదల తరువాత బొమ్మాళి పెళ్లి చేసుకొవడం ఖాయమని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు మొదలైయ్యాయి.

- Advertisement -