బిగ్ బాస్ 6..ఈవారి నామినేషన్స్‌లో ఉంది వీరే

156
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 6 విజయవంతంగా నాలుగోవారంలోకి అడగుపెట్టింది.నాలుగోవారం ఎలిమినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. ఇక నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య మాటలయుద్ధం తారాస్ధాయికి చేరింది. తొలుత శ్రీహాన్.. రాజశేఖర్‌, ఇనయాలను నామినేట్‌ చేయగా సుదీప.. ఇనయ, రేవంత్ లను నామినేట్ చేసింది.

ఇక గీతూ.. చంటి, ఇనయలను నామినేట్ చేయగా వసంతి.. రేవంత్‌, సూర్యలను నామినేట్ చేసింది. ఆరోహి.. ఇనయ, రేవంత్‌లను నామినేట్ చేయగా బాలాదిత్య.. సూర్య, రేవంత్ లను నామినేట్ చేసింది. ఇనయా.. సుదీప, శ్రీహాన్‌ లను నామినేట్ చేయగా చంటి.. గీతూ, ఇనయాలను, అర్జున్.. రాజ్‌, గీతూలను, సూర్య.. వసంతి, ఇనయలను, రేవంత్.. శ్రీసత్య, ఆరోహిలను,రాజ్.. శ్రీహాన్‌, ఆరోహిలను, రోహిత్-మెరీనా.. సూర్య, ఇనయలను నామినేట్ చేశారు. ఇక కీర్తి.. ఇనయ, రేవంత్ లని, శ్రీ సత్య.. రేవంత్ ని నామినేట్ చేసింది.

మొత్తంగా నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియలో అర్జున్‌, కీర్తితో పాటు ఇనయ, రేవంత్‌, సుదీప, శ్రీహాన్‌, గీతూ, సూర్య, రాజ్‌, ఆరోహిలు నామినేట్‌ అయ్యారు.

- Advertisement -