బిగ్ బాస్ 6..అట్టర్ ఫ్లాప్

4512
- Advertisement -

బిగ్ బాస్ ..బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో. బాలీవుడ్, కోలీవుడ్ లో మంచి రేటింగ్ సాధించిన ఈ షో తెలుగులో కూడా 6 సీజన్స్‌ పూర్తి చేసుకుంది. అయితే గత 5 సీజన్లలో బిగ్‌బాస్‌ తెలుగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ 6వ సీజన్‌ వరెస్ట్‌గా మిగిలిపోయింది. రేటింగ్‌లు రాక, కంటెస్టెంట్స్‌ సరిగా పర్ఫామెన్స్ చేయకపోవడం వంటివి పెద్ద మైనస్‌గా మారాయి. ఒకానొక దశలో బిగ్ బాసే స్వయంగా ఇంటి సభ్యులందరిని బయటకు పంపేస్తానని హెచ్చరించారంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక గత 5 సీజన్లతో పోలీస్తే ఈ సారి గ్రాండ్ ఫినాలే చప్పగా సాగింది. పెద్దస్టార్లు ఎవరు అతిథిగా రాకపోవడం ఒకవంతైతే కనీసం కంటెస్టెంట్స్ గురించి చెప్పే వారే కరువయ్యారు. రవితేజ, నిఖిల్ వంటి వారు వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయారు. గత సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి వంటి వారు రావడం ప్లస్ కాగా ఈసారి అసలు విన్నర్ కు ట్రోఫీ ఇచ్చేందుకు ఒక్క చీఫ్ గెస్ట్ ను కూడా తీసుకు రాలేని దుస్థితి. ఇక గ్రాండ్ ఫినాలే అంటే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలాగా ఉంటుందని బావించిన ఫ్యాన్స్ కు పూర్తిగా నిరాశే ఎదురైంది.

ఇక ఈ సీజన్‌ ఘోరంగా విఫలమవడానికి ఒక కారణం హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్స్ ఎంపిక, ఎలిమినేషన్, బిగ్ బాస్‌కు నచ్చిన వారుంటే వారు ఎన్ని తప్పులు చేసినా వారిని చివరి వరకు కొనసాగించడం. ముఖ్యంగా నాగార్జున బిగ్ బాస్ టీం వాళ్లు ఏం చెబితే అది చెప్పడం తప్ప షోలో ఇన్వాల్ అయింది లేదు. గత సీజన్లలో కంటెస్టెంట్స్‌కు క్లాస్ పీకడం, షోలో ఇన్వాల్వ్ అయిన వారిని ఎంకరేజ్ చేశారు కానీ ఈసారి అలాంటిదేమీ జరగలేదు. చెత్త విషయాలను హైలైట్ చేస్తూ షోని చెత్తచెత్త చేశారు.

ఇక గత సీజన్లతో పోలీస్తే ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక వరెస్ట్. ప్రతి సీజన్‌లో ఐదారుగురికి తక్కుక కాకుండా క్రేజ్ సంపాదించేవాళ్లు. కానీ ఈ సీజన్‌లో అలాంటిది జరగకపోగా ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకున్న వారే ఎక్కువ. కంటెస్టెంట్స్ ఆట సంగతి పక్కన పెడితే ఏకాభిప్రాయం అనే టాస్క్‌లతో జనాలకు పిచ్చిలేపారు. బాగా ఆడిన వాళ్లకి అన్యాయం చేసేట్టుగా చెత్త నిర్ణయాలతో షోకి రేటింగ్‌ పడిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారు బిగ్ బాస్. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ కూడా అంతబాగాలేదు. ముఖ్యంగా కీర్తి గ్రాండ్ ఫినాలే వరకూ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు ఈ సీజన్‌ అట్టర్‌ ఫ్లాప్ కావడానికి అంతా సమిష్టిగా కృషిచేసి నెక్ట్స్‌ సీజన్‌పై ఆశలు లేకుండా చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -