రోహిత్‌కి కన్నీళ్లు పెట్టించిన నిఖిల్..

111
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా ముగింపుదశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేలో భాగంగా టాప్ 5లో ఉన్న రోహిత్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. రోహిత్‌ని ఎలిమినేట్ చేసే బాధ్యత హీరో నిఖిల్‌కి అందించారు.

రోహిత్‌ని ఐదో స్థానానికి పరిమితం చేస్తూ ఇంటికి పంపారు. హౌస్‌లోకి వెళ్లిన నిఖిల్.. రోహిత్ నెత్తిన టోపీ పెట్టి బయటకు తీసుకుని వచ్చాడు. అనంతరం స్టేజ్‌పైకి వచ్చి మాట్లాడిన రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రిపేర్డ్‌గా రాలేదు.. వెళ్లడానికి కూడా ప్రిపేర్డ్‌గానే ఉన్నాను. మా అమ్మనాన్నల్ని చూస్తుంటే బాధగా ఉంది.. ఏడుస్తున్నతన తల్లిని చూసి సారీ అమ్మా అని తెలిపి ఎమోషన్ అయ్యారు రోహిత్.

నువ్వు మాకెందుకు సారీ చెప్తున్నావ్ నాన్నా.. నువ్వు ఆల్రెడీ గెలిచావ్ అది చాలు అని రోహిత్ పేరెంట్స్ చాలా ఎమోషల్‌గా మాట్లాడారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -