బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తొమ్మిది ఎపిసోడ్‌లను పూర్తిచేసుకోగా రెండోవారంలో 9 మంది హౌస్ సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఇక రెండో వారం ఎలిమినేషన్ ప్రాసెస్‌లో భాగంగా ఓటింగ్ ప్రారంభంకాగా అభిజిత్, గంగవ్వకు పెద్ద ఎత్తను మద్దతిస్తున్నారు నెటిజన్లు.
ఇక బిగ్ బాస్ అంటేనే లవ్,ఎమోషన్,గొడవలు..సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి మధ్య లవ్ ట్రాక్ నడవగా సీజన్ 4లో కూడా అలాంటి ట్రాక్ తెరపైకి వచ్చింది. అఖిల్,అభిజిత్‌లు మొనాల్‌ని ఇంప్రెస్ చేసేందుకు కుస్తీ పడుతున్నారు.బిగ్ బాస్ కెమెరాల ద్వారా మొనాల్ తన తల్లికి అఖిల్‌ని పరిచయం చేసింది.దీంతో మొనాల్‌ని అర్థరాత్రి పిలిచి నీతో 5 నిమిషాలు మాట్లాడాలని కోరాడు అభిజిత్. ఈ సందర్భంగా తనకు నీతో మాట్లాడాలని ఉందని మొనాల్ తెలపగా తెగఫీల్ అయిపోయాడు అభిజిత్.
తర్వాత మన పరిస్థితి ఏంటి క్లారిటీ ఇవ్వాలని కమ్యునికేషన్ గ్యాప్ వల్ల చిన్నది పెద్దది అయిపోద్ది.. నాతో మాట్లాడి క్లియర్ చేసుకో అంటూ ఓపెన్ అయ్యాడు అభిజిత్. అంతే అభిజిత్‌తో మొనాల్ ముచ్చట్లు పెట్టడంతో తెగ ఫీల్ అయిపోయాడు అఖిల్. ముఖం మాడ్చుకుని మొనాల్‌తో కొంతసేపు మాట్లాడటం మానేశాడు.
దీంతో అఖిల్ దగ్గరికి వచ్చి మాట్లాడేందుకు మొనాల్ ప్రయత్నించగా అఖిల్ వెళ్లిపోగా మొనాల్ ఏడ్చేసింది. దీంతో కరిగిపోయిన అఖిల్…మొనాల్‌ని ఓదార్చేపనిలో పడ్డారు. అయితే చివరగా తనకు అభితోగాని నీతోనూ ఏం లేదని టైం స్పెండ్ చేయడం తనకు ఇష్టమని అది అర్ధంచేసుకోవాలని తెలిపింది మొనాల్. మొత్తంగా బిగ్ బాస్ హౌస్‌లో లవ్ స్టోరీ షురూ కావడం చర్చనీయాంశంగా మారింది.