శ్రీహాన్‌ రన్నరపే కానీ విన్నర్!

512
- Advertisement -

106 రోజుల పాటు సాగిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా ముగిసింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్ విన్నర్‌గా రేవంత్, రన్నరప్‌గా శ్రీహాన్‌ నిలిచారు. చివరి క్షణం వరకూ నువ్వా నేనా అంటూ టైటిల్ కోసం రేవంత్ – శ్రీహాన్‌ పోటీ పడ్డారు. అయితే మిగిలిన ఇంటి సభ్యులతో పాటు శ్రీహాన్ తల్లిదండ్రులు కూడా డబ్బు తీసుకునేట్టుగా టెంప్ట్ చేశారు. దీంతో చివరికి శ్రీహాన్ రూ.40 లక్షల సూట్ కేసు తీసుకోగా రేవంత్‌ విన్నర్‌గా నిలిచారు. దీంతో రేవంత్‌కి ప్రైజ్‌మనీలో మిగిలిన రూ. 10 లక్షలు వచ్చాయి.

ఇక రేవంత్‌ విన్నర్‌గా నిలిచిన అనంతరం అతడికి షాకిచ్చారు నాగార్జున. ఓట్ల ప్రకారం శ్రీహాన్‌ విన్నర్ అని …రేవంత్ కంటే శ్రీహాన్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. దీంతో రేవంత్ విన్నర్‌గా నిలిచిన ఆ సంతోషం లేకుండా చేశారు.

ఈ సీజన్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీహాన్‌. హౌస్‌లోకి అడుగుపెట్టిన దగ్గరి నుండి తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఓవరాక్షన్‌తో విమర్శలు ఎదుర్కొన్నా తర్వాత తట్టుకుని నిలబడి సత్తాచాటాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -