బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 95 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు జాక్ పాట్ ఇచ్చారు బిగ్ బాస్. విన్నర్ ప్రైజ్ మనీలో కోత పెట్టి తిరిగి వాళ్ల ప్రైజ్ మనీని వారే సంపాదించుకునే అవకాశం ఇచ్చారు.
ప్రస్తుతం విన్నర్ ప్రైజ్ మనీ 41, 10, 100 ఉండగా.. ఐదో ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇద్దర్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. వీళ్లు రోహిత్, ఆదిరెడ్డిలను ఎంచుకోగా.. వీళ్లిద్దరికీ మేజ్ బోర్డ్ టాస్క్ ఇవ్వగా ఆదిరెడ్డి గెలిచారు. రేవంత్, ఇనయ, కీర్తి, శ్రీహాన్‌లు ఆదిరెడ్డికి మద్దతు ఇవ్వడంతో ఆ నలుగురికి కేటాయించిన మొత్తం 80, 000 లను విన్నర్ ప్రైజ్ మనీలో యాడ్ చేశారు.
తర్వాత 6వ ఛాలెంజ్‌లో భాగంగా కీర్తి, శ్రీహాన్ రాగా ఈ టాస్క్‌లో శ్రీహాన్ గెలుపొందటంతో.. విన్నర్ ప్రైజ్ మనీ 2,00, 000 లక్షలు యాడ్ అయ్యింది. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ 43, 90, 100కి పెరిగింది.
తర్వాత ఆదిరెడ్డి, శ్రీహాన్‌లకు చుక్కలు చూపించారు బిగ్ బాస్. డార్క్ రూంలో మొదటిగా ఆదిరెడ్డి పిలిచి.. అందులో ఎముకలు, దెయ్యాలు, పాములతో రకరకాల సౌండ్‌లు చేసి భయపెట్టేశారు. తర్వాత శ్రీహాన్‌ని ఆదిరెడ్డికి తోడుగా పంపించారు బిగ్ బాస్. చీకటి గదిలో మనుషులు దెయ్యాల వేషం వేసుకుని శ్రీహాన్, ఆదిరెడ్డిలను హడలెత్తించారు.
ఇవి కూడా చదవండి..