భారత్ చిత్తు..సిరీస్ బంగ్లా కైవసం

460
- Advertisement -

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ చిత్తయింది. దీంతో వన్డే సిరీస్‌ను కొల్పోయింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్న భారత్‌ …బంగ్లా బౌలర్ల ముందు విలవిలబోయింది. 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్..266 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ 5, శిఖర్ ధావన్ 8, శ్రేయాస్ అయ్యర్ 82, వాషింగ్టన్ సుందర్ 11, కేఎల్ రాహుల్ 14, అక్షర్ పటేల్ 56, శార్దూల్ ఠాకూర్ 7, దీపక్ చాహర్ 11, రోహిత్ శర్మ 51(నాటౌట్), సిరాజ్ 2, ఉమ్రాన్ మాలిక్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.

గాయం కారణంగా 9వ స్థానంలో దిగిన రోహిత్ శర్మ చివరి ఓవర్లలో 5 సిక్సులు, 3 ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. అయితే రోహిత్ ఇన్నింగ్స్‌ టీమిండియాను గెలిపించలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఎబాదత్ 3, మెహిదీ హసన్ 2, షకీబ్ 2, మహ్మదుల్లా, ముస్తఫిజర్ చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ బంగ్లా ఆల్ రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ 83 బంతుల్లో 100 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ ఇచ్చిన 271 పరుగులు చేసింది. అనముల్ హక్ 11, లిట్టొన్ దాస్ 7, నజ్ముల్ షాంటో 21, షకీబ్ హాసన్ 8, రహీం 12, మహ్ముదుల్లా 77, అఫిఫ్ 0, మెహిదీ హసన్ 100 (నాటౌట్), నాసం అహ్మద్ 18(నాటౌట్) పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -