ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చిన నాగ్…నామినేషన్స్‌లో ఉన్న వారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరికి ఆదిరెడ్డి, అభినయలు మిగిలారు. దీంతో వారిద్దరిలో ఎవర్ని ఎలిమినేట్ చేస్తారా అని కాసేపు ఉత్కంఠ నెలకొంది. స్టేజి మీద ఉన్న నాగార్జున ఒక చిన్న టాస్క్ తో అభినయ ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. దీంతో అభినయ హౌస్ లోంచి బయటకి వచ్చింది.
ఆ తర్వాత అభినయ వేదికపైకి వచ్చి భావోద్వేగానికి గురైంది. హౌస్ లో ఫైమా, చంటి, బాలాదిత్య, శ్రీసత్య, సూర్య లని హానెస్ట్ అని, రేవంత్ మాత్రం కన్నింగ్ అని, మిగిలిన వారంతా వారి స్ట్రాటజిలతో గేమ్ బాగా ఆడుతున్నారు అని తెలిపింది. ఇంత త్వరగా హౌస్ నుండి బయటకు వస్తానని ఊహించలేదని చెప్పుకొచ్చింది.
సండే ఫన్‌డే జాలీగా సాగింది. బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హౌస్‌లో సందడి చేసింది తమన్నా. హౌస్ లో ఉన్న అబ్బాయిలు హౌస్ లో ఉండే అమ్మాయిల్లో తమకి రక్షణగా ఉండే లేడీ బౌన్సర్ ని ఎంచుకోవాలి అని చెప్పాడు నాగార్జున. దీంతో ఒక్కో జెంట్ కంటెస్టెంట్ ఒక్కో అమ్మాయిని లేడీ బౌన్సర్ గా ఎన్నుకున్నారు. అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్యని ఎంచుకోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని కాసేపు ఆటపట్టించారు నాగ్. ఎక్కువమంది లేడీ బౌన్సర్ గా గీతూని ఎంచుకున్నారు. తర్వాత తమన్నా అబ్బాయిల్లో నుంచి రోహిత్, రేవంత్, అర్జున్, సూర్యని తన బౌన్సర్లు గా ఎంచుకుంది. ఈ నలుగురు తమ ట్యాలెంట్‌తో తమన్నాని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించారు.