శ్రీవిష్ణు కోసమే వచ్చా: అల్లు అర్జున్

23
allu
- Advertisement -

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తుండగా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ఈ ఫంక్షన్ కి వచ్చి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన మీ అందరికి థ్యాంక్యూ. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఆర్మీ ఉంది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులకి థ్యాంక్యూ అని తెలిపారు. శ్రీవిష్ణు గారంటే నాకు ప్రత్యేక అభిమానం. ఆయన మొదటి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్ చూసిన తర్వాత పిలిచి మాట్లాడాను. ఆయన అన్ని సినిమాలు చూస్తాను అని తెలిపారు.

పుష్ప 2 సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్నాను. అసలు బయట ఈవెంట్స్ కి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ శ్రీ విష్ణు నాకు చాలా ఏళ్ల పరిచయం. అప్పట్నుంచి నన్ను ఏమి అడగలేదు. తొలిసారి అడగ్గా తనకోసమే వచ్చానని తెలిపారు బన్నీ.

- Advertisement -