సిరి….ఫస్ట్ లవ్ ఎమోషన్..!

30
siri

బిగ్ బాస్‌ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 19వ ఎపిసోడ్ పూర్తిచేసుకోగా మూడోవారం ఎలిమినేషన్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఇక మూడోవారం ఇంటి కెప్టెన్‌గా జస్వంత్‌ ఎంపిక కాగా ఇంటి సభ్యులైన సిరి, ప్రియాంక తమ తొలి ప్రేమను చెబుతూ నా ఆటోగ్రాఫ్‌ సినిమాను గుర్తుచేశారు. గురువారం ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులు వారి వారి తొలి ప్రేమల్ని గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా తన పదో తరగతి లవ్ స్టోరీ చెప్పి ఎమోషన్ అయింది సిరి. .

అతని పేరు విష్ణు.. ముద్దు పేరు చిన్నా. నా ఫస్ట్ లవ్ అతనే.. మేం ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్లం. ఓరోజు తన నాకు ప్రపోజ్ చేశాడు.. తనంటే నాకూ ఇష్టమే కావడంతో ఎప్పుడెప్పుడు చెప్తాడా? అని నేనూ వెయిట్ చేసి.. చివరికి ఓకే చెప్పేశా. అయితే నేను ఎవరితో మాట్లాడిన గొడవ పడేవాడు. దీంతో మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరగగా అదే టైంలో నాకు పెళ్లి సంబంధం వచ్చింది.. అతని మీద కోపంతో నేను ఒప్పేసుకున్నాను.

రేపు ఎంగేజ్‌మెంట్ అనగా నా దగ్గరికి వచ్చి నువ్ లేకుండా ఉండలేను. నేను తప్పు చేశా అని కాళ్లమీద పడ్డాడు.దీంతో తెల్లారి ఎంగేజ్ మెంట్ అనగా.. రాత్రికి రాత్రి అతనితో జంప్ అయిపోయానని తెలిపారు. తర్వాత మా అమ్మ నాతో మాట్లాడి వెనక్కి తీసుకుని వచ్చారు. కానీ మేం రిలేషన్ షిప్‌లోనే ఉన్నాం…. ఆ రిలేషన్ షిప్ చాలా బాగుందని చెప్పుకొచ్చింది.

అయితే ఓ రోజు ఉదయాన్నే షాకింగ్ న్యూస్ తెలిసింది. విష్ణు చనిపోయాడు అని…తన కోసం నేను ఎంతో చేశా.. కానీ తనని ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. తనని నేను మర్చిపోలేకపోతున్నా.. ఐ లవ్యూ విష్ణు అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.