బిగ్ బాస్ తెలుగు 5..ఈవారం వీరిద్దరిలో ఒకరు ఔట్!

41
bigg

బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రెండో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎలిమినేషన్‌లో లోబో, ప్రియాంక సింగ్, ప్రియా, ఆర్జే కాజల్,ఆనీ మాస్టర్,ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ ఉండగా ఈ వారం వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం తొలివారం సరయు ఇంటి నుండి బయటకు రాగా ఇక ఈ వారం ఓటింగ్ ప్రకారం ఉమాదేవి, నటరాజ్ మాస్టర్‌లలో ఒకరు ఇంటి నుండి బయటకు రానున్నారు. ఓటింగ్‌లో లోబో టాప్ పొజిషన్‌లో ఉండగా లీస్ట్‌లో ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. లోబో 26.05 శాతం ఓట్లతో టాప్‌లో ఉండగా 22.12 శాతం ఓట్లతో ప్రియాంక సింగ్,17.03 శాతం ఓట్లతో ప్రియా,12.52 శాతం ఓట్లతో ఆర్జే కాజల్,8.63 శాతం ఓట్లతో ఆనీ మాస్టర్ ఉన్నారు. ఇక ఉమాదేవి 7.49 శాతం ఓట్లతో, నటరాజ్ మాస్టర్ 6.15 శాతం ఓట్లతో లీస్ట్‌లో ఉన్నారు. దీంతో ఈ వారం ఉమాదేవి, నటరాజ్ మాస్టర్‌లలో ఒకరు ఎలిమినేట్ కావడం పక్కాగా కనిపిస్తోంది.