బిగ్ బాస్ 5…ఎపిసోడ్39 హైలైట్స్

31
ravi

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా 39 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 39వ ఎపిసోడ్‌లో భాగంగా గ్రీన్ టీం (రవి, లోబో, శ్వేతా)లకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించింది.దీంతో ఆపోజిట్ టీంలో ఉన్న బొమ్మల్ని తీసుకోవచ్చని బిగ్ బాస్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. దీంతో బ్లూ కలర్ టీం (మానస్, సన్నీ, ఆనీ)ల దగ్గర ఉన్న బొమ్మల్ని తీసేసుకున్నారు. దీంతో ఈ ముగ్గురికీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఆనీ మాస్టర్ నోట మాట రాలేదు.

ఆనీ మాస్టర్ అయితే శ్వేతతో కొట్లాడి మరీ బొమ్మల్ని చింపేసింది. దీంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. కూతురు కూతురు అంటారు అదేం పద్దతి అని లోబో అడగ్గా.. ఇది టాస్క్ అని చెప్పింది ఆనీ మాస్టర్.

ఇక యాంకర్ రవి గేమ్ ప్లాన్ గురించి సన్నీ-మానస్-కాజల్‌ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. అందరూ బొమ్మల్ని కష్టపడి కుడుతుంటే వాళ్లు మాత్రం చాలా రిలాక్స్‌గా ఉన్నారు.. ఇంత క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదని అన్నాడు సన్నీ. మానస్ మాటల్ని బట్టి యాంకర్ రవికి బిగ్ బాస్ టాస్క్‌‌లు ఎలా ఉంటాయి?? ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ చేస్తారు? నామినేషన్ ఎలా ఉంటుంది అన్నదానిపై ముందే అంతా చెప్పారా అనే అనుమానాలు బలపడ్డాయి.

గత రెండు మూడు వారాలుగా ఎంత కష్టపడ్డా.. లక్ ఫేవర్ చేయకపోవడంతో మానస్, సన్నీలు కెప్టెన్ పోటీదారులు కాలేకపోవడం ఎమోషనల్ అయ్యారు. ఇక శ్వేతపై అరిచిన ఆనీ మాస్టర్ తినడం మానేసింది. మానస్ అంటే పడిచస్తున్న ప్రియ.. అర్ధరాత్రి దాటిన తరువాత మానస్ దగ్గరకు వెళ్లి కోపంగా ఉన్నావా? నీతో మాట్లాడొచ్చా అని అడిగింది.

టాస్క్‌లలో నేను 100 పర్శంట్ ఎఫర్ట్ ఇస్తున్నానా? అని అడిగింది. హా ఇస్తున్నావ్ గా అని చెప్పాడు మానస్. దీంతో ప్రియ.. నువ్ అంటుంటావ్ కదా.. నేనొక బోర్డర్ పెడతా దాన్ని ఎవరూ క్రాస్ చేయలేరు అని.. నేనెప్పుడైనా అది క్రాస్ చేసినట్టు నీకు అనిపించిందా? అని అడిగింది. అదేం లేదు అని తెలిపాడు మానస్.