మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు…

75

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109కి చేరగా, డీజిల్‌ ధర రూ.102.04కు పెరిగింది.

గత 20 రోజుల్లో 15 రోజులు చమురు ధరలు అధికమయ్యాయి. ఢిల్లీలో లీటరుకు రూ.4.55 పెరిగాయి. గత సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 30 పైసల నుంచి 39 పైసల వరకు పెరిగాయి.