బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 101 హైలైట్స్

72
bigg boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 101 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. షణ్ముఖ్ జర్నీ కోసం బిగ్ బాస్ పిలవడంతో.. సిరి హగ్ విత్ ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పంపించింది. షణ్ముఖ్‌కి సంబంధించి చాలా వరకూ ఫొటోలు మోజ్ రూంవే ఉన్నాయి. అర్ధం చేసుకునే స్నేహితులు ఈ ఇంట్లో దొరికారని.. మీ మనసుకి దగ్గరైన వారితో అభిప్రాయభేదాలు వచ్చిన ప్రతిసారి.. మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారని చెప్పారు.

ఎన్ని గొడవలైనా.. చివరి వరకూ ఒకరిగానే ఉన్నారు.. మీకు ఇష్టమైన చోటు మోజ్ రూం అని బిగ్ బాస్‌కి తెలుసు.. మీలోని ప్రేమను ఆ గది చూసింది అని తెలిపారు బిగ్ బాస్. ఇక స్పెషల్ వీడియోలోనూ చాలా వరకూ సిరితో చేసిన రొమాన్స్ హగ్‌లే చూపించారు. మీ మనసుని తాకిన ఫొటో గ్రాఫ్‌ని మీతో కలిసి తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోని తీసుకుని వెళ్లాడు షణ్ముఖ్.

ఆ తరువాత షణ్ముఖ్ బిగ్ బాస్ తనతో ఏం మాట్లాడాడో సిరికి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇంతలో సన్నీ రావడంతో నా గురించి ఎక్కువ మాట్లాడింది సన్నీనే…. నేను లేనప్పుడు నా గురించి మాట్లాడాడు అని పంచ్ వేశాడు షణ్ముఖ్. ఆ తరువాత సన్నీ వంతురావడంతో.. తన జర్నీని చూసుకోవడం కోసం ఆత్రంగా ఎదురుచూశాడు. అయితే సన్నీకి గిల్టీ బోర్డ్ వేసి అత్యంత అవమాన కరంగా అవమానించగా.. ఈ జర్నీ వీడియోలోనూ గిల్టీ బోర్డ్‌తోనే స్వాగతం పలికారు. కష్టపడి ఆడి వరస్ట్ పెర్ఫామర్‌ తీసుకున్నా.. అయినప్పటికీ టాప్ 5లో ఉన్నానంటే దానికి కారణం ఆడియన్స్ లవ్ అండ్ సపోర్ట్ అని అన్నాడు సన్నీ.

సరదా సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు గుర్తు చేశారు. ఈ ఇంట్లో మీరు బంధాలు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా అందరి మొహంపైనవ్వు తీసుకుని వచ్చి ఎంటర్ టైనర్‌గా ముద్ర వేసుకున్నారు. మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు.. వాళ్లు మిమ్మల్ని ఇష్టపడినా లేకున్నా.. మీలోని స్నేహితుడు వాళ్లని పరిచయం చేశాడు. అప్నా టైం ఆయేగా.. అన్న మీ మాట మిమ్మల్ని ప్రేమించే వారికి గట్టిగా వినిపించింది. సన్నీని హీరోగా చూపించారు. అనంతరం తన తల్లితో ఉన్న ఫొటోతో పాటు.. మానస్‌తో ఉన్న ఫొటోని కూడా తీసుకుని వెళ్లాడు.