బిగ్ బాస్ సీజన్ 4లో భాగంగా ఆరోగ్యం బాగాలేక రెండో కంటెస్టెంట్ బయటకు వచ్చేశాడు. ఇప్పటికే గంగవ్వ ఆరోగ్యం బాగాలేక పలుమార్లు బిగ్ బాస్‌కు విజ్ఞప్తి చేయగా ఆమె విజ్ఞప్తి మేరకు బయటకు పంపేశారు బిగ్ బాస్. తాజాగా సింగర్ నోయల్ కూడా ఆరోగ్యం సహకరించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బయటకు వచ్చేశాడు.
అర్థరైటిస్ వ్యాధి ఉండటంతో చల్లని ప్రదేశంలో ఉంటే కీళ్ల నొప్పులు అధికం అవుతుంటాయి. దీంతో తీవ్ర అనారోగ్య కారణంగా ఒత్తిడికి గురయ్యాడు. బాధను మరిచిపోవడానికి సాగేనా ఈ పయనం ఆగేనా.. ఈ రాత్రి ఎట్టా గడిచేనా అంటూ మైండ్ డైవర్ట్ చేసుకుంటూ బాధను మరిచిపోయే ప్రయత్నం చేశాడు నోయల్.
నోయల్‌ని పరీక్షించిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం అందించాలని బిగ్ బాస్‌కి తెలియజెప్పడంతో నోయల్‌ని కన్పెషన్ రూంకి పిలిచి మాట్లాడారు బిగ్ బాస్.మీకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని.. అందుకోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్.
దీంతో భారంగా బిగ్ బాస్ హౌస్‌ని వీడాడు నోయల్. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అంటూ తెగ ఏడ్చేసింది హారిక. నోయల్ పూర్తి ఆరోగ్యవంతుడై తిరిగిరావాలని కోరుకుంటున్నా అని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ రావడంతో నోయల్ మళ్లీ బిగ్ బాస్ హౌస్‌ని రావడం ఖాయంగా మారింది. దీంతో నోయల్‌ని నవ్వుతూ ఇంటి నుంచి పంపించారు.