బిగ్ బాస్ కెప్టెన్‌గా అరియానా…

34
ariyana

బిగ్ బాస్ సీజన్ 4 ఎనమిదోవారం ఇంటి కెప్టెన్‌గా ఎంపికైంది అరియానా. బిగ్ బాస్ 4 కెప్టెన్‌ కావాలన్నది తన కల అని అది నెరవేరిందని తెగ సంబర పడిపోయింది అరియానా. ముందుగా ఈ వారం కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఆడవాళ్లకు మాత్రమే ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఆడవాళ్లను కెప్టెన్ చేసే బాధ్యతను ఇంట్లో ఉన్న మగవాళ్లకు ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఒక కీ, బాక్స్ ఇచ్చి దాన్ని చేజిక్కించుకున్న వాళ్లు తమకు నచ్చిన వాళ్లకి ఆ కీ ఇవ్వొచ్చని తెలిపారు ఎక్కువమంది అరియానాకు ఇవ్వడంతో ఆమె కెప్టెన్ అయింది.

మొదటి రౌండ్ అఖిల్‌ కీని దక్కించుకోగా మోనాల్‌కు ఇచ్చాడు దీంతో ఆమె హారికకు కెప్టెన్ పోటీ రేసు నుండి తప్పించింది. ఇక రెండో రౌండ్‌లో కీని మెహబూబ్ దక్కించుకోవడంతో ఆ కీని అరియానాకి ఇచ్చాడు మెహబూబ్. అరియానా వెంటనే లాస్యను కెప్టెన్ రేసు నుండి తప్పించింది.

ఇక మూడో రౌండ్‌లో కీని రాజశేఖర్ మాస్టర్ దక్కించుకోవడంతో అరియానాకి ఇచ్చాడు. దీంతో మోనాల్ ఫొటో ఉన్న యాపిల్‌ పీకిపారేసి హౌస్‌కి కెప్టెన్ అయ్యింది అరియానా. కెప్టెన్ అయిన ఆనందంలో తెగ సంబరపడిపోయింది అరియానా.