బిగ్ బాస్ 4…పదోవారం మెహబూబ్ ఔట్!

32
mehaboobmehaboob

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 70 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 10వ వారం ఎలిమినేషన్‌లో ఆరుగురు ఉండగా అభిజిత్ ఇప్పటికే సేవ్ అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన వారిలో సొహైల్,మోనాల్,అరియానా,హారిక,మెహబూబ్ ఉండగా ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న మెహబూబ్‌ ఈ వారం ఎలిమినేట్ కావడం పక్కాగా కనిపిస్తోంది.

ఇక ఇప్పటివరకు జరిగిన ఓటింగ్‌లో అభిజిత్ 20 శాతం ఓట్లతో టాప్‌లో ఉండగా సొహైల్ 18.5,మోనాల్ 18.43,హారిక 17.53,అరియానా 16.44,మెహబూబ్ 8 శాతం ఓట్లతో ఉన్నారు. దీంతో మెహబూబ్ ఎలిమినేషన్ పక్కాగా కనిపిస్తోంది.

మొదటివారంలో సూర్య కిరణ్ ఎలిమినేట్ కాగా తర్వాత రెండవ వారంలో కరాటే కల్యాణి,మూడవ వారంలో స్వాతి దీక్షిత్,నాలుగో వారంలో దేవి నాగవల్లి,5వ వారంలో అనారోగ్యంతో గంగవ్వ, సుజాత ,6వ వారంలో కుమార్ సాయి,7వ వారంలో దివి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనమిదో వారంలో అనారోగ్య కారణాలతో నోయల్ బయటకు వెళ్లగా తొమ్మిదో వారంలో అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు.