అఖిల్ పై పగ తీర్చుకున్న కుమార్ సాయి…

37
saikumar

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇప్పటివరకు 104 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా ఈ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లాస్య,కుమార్ సాయి,కరాటే కల్యాణి,మోనాల్ సడన్ సర్‌ప్రైజ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేశారు.

తొలుత మోనాల్, తర్వాత కరాటే కల్యాణి,లాస్య హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా తర్వాత వచ్చిన కుమార్ సాయి…అఖిల్‌పై పగ తీర్చుకున్నాడు. నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర. ఇద్దరికి కరివేపాకు అంటే నచ్చదు అని మరోసారి కరిపేపాకు గొడవను గుర్తు చేశాడు.

అఖిల్ నువ్ ఆడుతున్నావ్ కానీ.. రిజల్ట్ రావడం లేదు.. నువ్ కష్టపడుతున్నావ్.. బట్ ఫోకస్ ఉండటం లేదు.. ఎనర్జీతో ఆడుతున్నావ్ గ్రేట్ అయినా ఫెయిల్ అవుతున్నావ్.. కరివేపాకు వేస్తున్నావ్ కానీ ఆ ఫ్లేవర్ రావడం లేదు అని చెప్పాడు కుమార్ సాయి.అఖిల్ కూడా మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో అంటూ తన యాటిట్యూట్ చూపించాడు.

అమ్మాయి అంటే హారికలా ఉండాలంటూనే ఆమెపై పంచ్‌లు వేశాడు. అభిజిత్‌ను నామినేట్‌ చేస్తుంది మళ్లీ బాధపడుతోంది. నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పి నామినేట్‌ చేస్తుంది అంటూ హారికను ఏడిపించాడు.