బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 89 హైలైట్స్

76
episode 89

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 89 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 89వ ఎపిసోడ్‌లో భాగంగా రేస్ టూ ఫినాలే టాస్క్ అఖిల్-సోహైల్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగగా హారిక-అభిజిత్ మధ్య మోనాల్ టాపిక్‌తో బేదాభిప్రాయాలు వచ్చాయి.

ఫినాలే టాస్క్‌లో భాగంగా అఖిల్-సొహైల్‌లకు ఉయ్యాల టాస్క్ ఇచ్చారు. ఇద్దరూ ఉయ్యాలపై కూర్చుని ఊగుతూ ఉండాలని ఎవరైతే ముందుగా ఉయ్యాల దిగుతారో వారు ఓడిపోయినట్లని తెలిపిన బిగ్ బాస్ ఈ టాస్క్‌కు సంచాలకుడిగా అభిజిత్‌ని నియమించాడు.

ఇక బజర్ మోగగానే ఉయ్యాలపై కూర్చున్న సోహైల్-అఖిల్…ప్రాణం పెట్టి ఆడతాం.. ఇద్దరిలో ఎవరు గెలిచినా మాకు ఓకే అంటూ ఆటలోకి దిగారు. ఎండలో కూర్చోబెట్టి మనాలా జాకెట్స్ ధరించాలని చెప్పారు.. ఇక టాయిలెట్స్ వస్తుందని ఇబ్బంది పడుతున్న టైంలో.. పసుపు పాలు ఇచ్చి తాగాలని చెప్పారు. దీంతో టాయిలెట్ ఆపుకోలేని అఖిల్ బెడ్ షీట్స్ అడ్డుపెట్టి టాయిలెట్స్ కవర్‌లోనే కానిచ్చేశారు.

ఇక టాస్క్ మధ్యలో అవినాష్‌ని మోనాల్ అన్నయ్య అనడం,అవినాష్ సరదా కామెడీ చేయడంతో ఎపిసోడ్ అలా గడిచిపోయింది. తర్వాత ఈ ఉయ్యాలపై ఉండటానికి తాను ఎందుకు అర్హుడో.. చెప్పాలని ఇద్దరి మధ్య ఫిటింగ్ పెట్టారు. దీంతో ఇద్దరు ఒకరినొకరూ కాసేపు వాదించుకున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదనకు దిగారు.

ఈ టైంలో మోనాల్‌ తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని బయటపెట్టారు అభిజిత్. టాస్క్‌లో నేను మోనాల్‌తో డేట్‌కి వెళ్తే సరిపోయేది కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడిన చిన్న పాయింట్‌గానే కనిపిస్తుందన్నారు. హారిక ముందు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండగా పదే పదే అనడంతో అభిజిత్ సీరియస్ అయ్యాడు. ముందు నేను చెప్పేది విను… నేను ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదా?? ఇక అర్థం చేసుకోవా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకో అంటూ సీరియస్ అయి వెళ్లిపోయాడు అభిజిత్. తర్వాత హారిక సారీ చెప్పినా పట్టించుకోలేదు.

మరోవైపు అఖిల్-సొహైల్‌లు మాత్రం ఉయ్యాల దిగకుండా నానా తిప్పలూ పడ్డారు. ఇంటి సభ్యులు కూడా టాస్క్ అయ్యే వరకూ మెలుకువగానే ఉండాలని..లైట్ల ఆఫ్ చేయబడవని చెప్పారు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ టాస్క్ అందరికి ఇచ్చినట్లు ఉందని ఇంటి సభ్యులు బాధపడుతునే మెలుకువతో ఉన్నారు.