బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 85 హైలైట్స్

71
episode 85

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 85 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 85వ ఎపిసోడ్‌లో చివరి వరకు టెన్షన్‌ రేపుతు ఈ వారం అవినాష్ ఎవిక్షన్ పాస్ ఉపయోగించడంతో ఎవరు ఎలిమినేట్ కాలేదు. ఇక ఈగ ఫేం కిచ్చా బిగ్ బాస్‌ ఇంటి సభ్యులతో కాసేపు మాట్లాడి అలరించాడు.

సండే ఫన్ డేలో భాగంగా నాగ్‌తో పాటు ఇంటి సభ్యులంతా సోగ్గాడే చిన్ని నాయన సాంగ్‌తో అలరించారు. తొలుత ఒక్కొక్కరూ డార్క్ రూంలోకి వెళ్లి అక్కడ ఉంచిన మూడు వస్తువులను చీకట్లో వెతికి తీసుకురావాలని సరదా టాస్క్ ఇచ్చారు. అరియానా ఆ డార్క్ రూంలోకి వెళ్లడానికి బెంబేలెత్తిపోగా.. మోనాల్, హారికలు ధైర్యంగా వెళ్లివచ్చేశారు.అఖిల్, సొహైల్‌లు భయపడినట్టుగా నటించడానికి గట్టిగానే కష్టపడ్డారు. అభిజిత్,అవినాష్ లోపలికి వెళ్లి తమ టాస్క్‌ని విజయవంతంగా పూర్తి చేశారు.

ఇక కన్నడ బిగ్ బాస్ వరుసగా ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా హోస్ట్ చేస్తున్న కిచ్చా సుదీప్.. తెలుగు బిగ్ బాస్ స్టేజ్‌పై సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ వల్ల చాలా నేర్చుకున్నానని.. హోస్ట్ చేయాలంటే చాలా ఓపిక కావాలన్నారు. తర్వాత నాగార్జున ఇంటి వెళ్లిపోయారని ఇంటికి తానే హోస్ట్ చేస్తా అంటూ షాక్ ఇచ్చారు.

తిరిగి నాగార్జున హోస్ట్ చేయాలంటే ఆయనే ఎందుకు హోస్ట్‌గా రావాలో ఒక్కమాటలో చెప్పాలని కోరారు. తొలుత హారిక ప్రారంభించిన కిచ్చా సుదీప్…అందరూ చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయి నాగ్‌ని స్టేజ్ మీదకు పిలిచేశారు.

తర్వాత అవినాష్‌తో ఆటాడాకున్నారు సుదీప్. హౌస్‌లో ముగ్గురు అమ్మాయిలు హారిక, అరియానా, మోనాల్‌లతో ఎవరితో డేట్‌కి వెళ్తావ్.. పెళ్లి ఎవర్ని చేసుకుంటావ్.. ఎవర్ని చంపేస్తావ్ అని అడగ్గా.. మోనాల్‌తో డేట్, హారికతో పెళ్లి, అరియానాని చంపేస్తా అని ఆన్సర్ ఇచ్చారు. తర్వాత నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురు అఖిల్,అరియానా,అవినాష్‌లలో అఖిల్‌ని సేవ్ చేశాడు సుదీప్.

తర్వాత అవినాష్‌- అరియానా ఉండగా కాసేపు సస్పెన్స్ అనంతరం తాను ఎలిమినేట్ అయినట్టు అనిపిస్తుందని.. అందుకే తనకోసం తాను ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని ఉపయోగించుకుంటానని చెప్పాడు అవినాష్. అయితే అనుకున్నట్టుగా అవినాష్ ఎలిమినేట్ కావడంతో ఎవిక్షన్ పాస్ ద్వారా సేవ్ అయ్యాడు.దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పుకున్నారు ఇంటి సభ్యులు.