నేను ఎలిమినేట్ అయ్యా…అవినాష్ కంటతడి!

206
avinash

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 85 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 85వ ఎపిసోడ్‌లో భాగంగా కిచ్చా సుదీప్ సర్‌ప్రైజ్,అవినాష్ ఎవిక్షన్ పాస్ ఉపయోగించడంతో ఇంటి నుండి ఎవరూ ఎలిమినేట్ కాలేదు.

ఎలిమినేషన్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. హారిక-అవినాష్‌లు ఇద్దరు మాత్రమే ఉండగా ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని…అవినాష్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ద్వారా ఎవరు ఎలిమినేట్ కాకుండా చూడవచ్చని కానీ దానిని అవినాష్ సరిగా ఉపయోగించాలని తెలిపారు. దీంతో కాసేపు ముచ్చటించిన అనంతరం నేను ఎలిమినేట్ అవుతానని తనకు అనిపిస్తుందని అందుకే ఎవిక్షన్ పాస్ తనకే ఉపయోగించుకుంటానని అవినాష్‌ తెలపగా అరియానాతో పాటు ఇంటి సభ్యులు కూడా అదే సరైన నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. అవినాష్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ ఎలిమినేట్ కాగా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో సేవ్ అయ్యారు.

ప్రేక్ష‌కుల దృష్టిలో మాత్రం తాను ఎలిమినేట్ అయ్యాన‌ని అవినాష్ బాధ‌ప‌డ్డాడు. ఇప్పుడు నేను ముందుకెళ్లాలా? ఆగిపోవాలా? అనేది అర్థం కావ‌ట్లేద‌న్నారు. దీంతో నాగార్జున అత‌డికి ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్‌కు రాక‌ముందు ఉన్న అవినాష్ వేరు, హౌస్‌లోకి వ‌చ్చాక అవినాష్ వేర‌ని ఆకాశానికెత్తారు.