బిగ్ బాస్ …ఎపిసోడ్ 51 హైలైట్స్

235
episode 51
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా 51 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఎనమిదోవారంలో ఆరుగురు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఎలిమినేషణ్ ప్రక్రియ హాట్ హాట్‌గా కనిపించింది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్‌ ఉన్నారు.

బిగ్ బాంబ్‌ టాస్క్‌లో భాగంగా కిచెన్‌లో వంట చేస్తూ కనిపించింది లాస్య. సమంత స్పెషల్ రిక్వెస్ట్‌పై అభిజిత్ వస్తువుల్ని బట్టల్ని తిరిగి ఇచ్చేశారు బిగ్ బాస్. మార్నింగ్ మస్తీలో భాగంగా తమకు నచ్చిన వ్యక్తి గురించి పాజిటివ్, నెగిటివ్ అంశాలను రాసి వాటిని చదివి వినిపించాలని చెప్పారు బిగ్ బాస్.అభి కోసం అఖిల్ రాయగా మెహబూబ్ కోసం మోనాల్ చాలా పాజిటివ్‌గా రాసింది. ఆ తర్వాత లాస్య, అరియానా, మోనాల్‌లు బతుకమ్మ ఆడుతుంటే వాళ్లతో జతకలిసి బతుకమ్మ ఆడాడు అవినాష్. నోయల్, అభి, లాస్య, హారికలు ఎప్పటిలాగే మోనాల్ గురించి చర్చిస్తూ.. లాస్య నవ్వుతూనే అభి-మోనాల్‌ల మధ్య పుల్ల పెట్టింది.

ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. 11 మంది సభ్యులు ఈ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనగా బిగ్ బాస్ ప్రయాణంలో ఏ సభ్యుడి వల్లన్నైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. లేదంటే ఇక ముందు పనాలా వ్యక్తితో ఇబ్బందులు ఎదురౌతాయని భావిస్తున్నా.. వాళ్ల పేర్లు చెప్పి అందుకు గల కారణాలు చెప్పి.. ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. ఇంటి కెప్టెన్‌గా అవినాష్ నామినేషన్ నుండి తప్పించుకున్నారు.

లాస్య.. అమ్మా రాజశేఖర్, మోనాల్, అఖిల్.. అరియానా, అమ్మా రాజశేఖర్, మెహబూబ్.. అరియానా, మోనాల్, అవినాష్.. లాస్య, హారిక, అమ్మా రాజశేఖర్.. అఖిల్, లాస్య, అరియానా.. మెహబూబ్, అఖిల్, సొహైల్.. అరియానా, రాజశేఖర్ మాస్టర్, నోయల్.. మెహబూబ్, అఖిల్,అభిజిత్.. మోనాల్ గజ్జర్, అమ్మా రాజశేఖర్, హారిక.. అరియానా, మెహబూబ్, మోనాల్ గజ్జర్.. మెహబూబ్, లాస్య పేర్లను చెప్పారు.నామినేషన్ ప్రక్రియలో భాగంగా అఖిల్-అమ్మా రాజశేఖర్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తానికి హాట్ హాట్‌గా సాగిన ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్‌లు నామినేట్ అయ్యారు.

- Advertisement -