బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 47 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శుక్రవారం ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి కెప్టెన్‌గా అనివాష్ ఎంపిక కావడం, రేషన్ డీలర్‌గా అరియానా ఎంపికవడంతో పాటు కెప్టెన్‌గా వీరిద్దరి మధ్య జరిగిన పోరుతో ఆసక్తికరంగా మారింది.
అరియానా, అవినాష్‌కు కెప్టెన్సీ టాస్క్ కింద బండి తోయరా బాబు అనే టాస్క్ ఇచ్చారు. పోటీదారులు ఇద్దరికీ రెండు ట్రాలీలు ఇచ్చిన బిగ్ బాస్…ఆటముగిసే సమయానికి ఏ కెప్టెన్సీ పోటీదారుడు అయితే ట్రాలీ సహాయంతో తమ స్టేషన్‌లో ఎక్కువ మంది సభ్యులను ఉంచగలుగుతారో వారు ఇంటి కెప్టెన్ అవుతారని తెలిపారు.
ఈ పోటీలో అరియానా, అవినాష్ శక్తికి మించి కష్టపడ్డారు. ఇద్దరూ ఒక్కొక్క ఇంటి సభ్యుడిని ట్రాలీలో ఎక్కుంచుకుని తమ తమ స్టేషన్లలో ఉంచారు. అయితే ఇంట్లో ఉన్న మిగిలిన పది మందిలో ఇద్దరి వైపు ఐదు,ఐదుగురు రావడంతో పోటీ టై అయింది. దీంతో మరో అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ సభ్యులను ఒప్పించి తమ స్టేషన్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. మోనాల్, అమ్మ రాజశేఖర్, నోయల్ తమ స్టేషన్ నుంచి అవతల స్టేషన్‌కు వెళ్లి మళ్లీ మనసు మార్చుకుని యథాస్థానానికి వచ్చేశారు.
చివరగా అరియానా స్టేషన్‌లో ఉన్న మోనాల్…. అవినాష్ స్టేషన్‌లోకి రావడంతో అవినాష్ స్టేషన్‌లో ఆరుగురు సభ్యులయ్యారు. తమ వైపు రావాలని అవినాష్ స్టేషన్‌లో ఉన్న వారిని ఎంత కన్విన్స్ చేసిన వారు వినకపోవడంతో చివరకు అవినాష్‌ని కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు బిగ్ బాస్. ఓడిపోవడంతో కంటతడి పెట్టింది అరియానా.
బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అవినాష్.. ఆ వెంటనే అరియానాను రేషన్ డీలర్‌గా నియమించాడు. ఇక కొత్తగా కెప్టెన్‌గా ఎంపికైన అవినాష్ ఇంటి సభ్యులకు కొన్ని సూచనలు చేశాడు. ఎవరైనా మైక్ పెట్టుకోవడం మరిచిపోతే తీస్తూ పెట్టుకుంటున్నట్టు 100 సార్లు చేయాలని అన్నాడు. ఏ సభ్యుడైనా నిద్రపోవడం వల్ల రెండు సార్లు బౌ బౌ వస్తే కనుక రెండు సార్లు పూల్‌లో దూకాలని, ఎవరైనా ఇంగ్లిష్‌లో మాట్లాడితే బిగ్ బాస్ ప్రతి కెమెరా దగ్గరకు వెళ్లి చిన్న పిల్లాడిలా లేదంటే చిన్న పిల్లలా ‘ఇంకోసారి ఇంగ్లిష్‌లో మాట్లాడను బిగ్ బాస్’ అని చెప్పాలన్నారు. ఇక చివరగా రేషన్ డీలర్ అరియానాకు పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. ఈ వారం రేషన్ సామాను కావాలా లేదా అభిజిత్ బట్టలు కావాలా అంటే రేషన్ సామాను కావాలని చెప్పి అందరి మనసులు గెలుచుకుంది.