బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 47 హైలైట్స్

56
bb 5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 47 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. గత ఎపిసోడ్స్‌లో సన్నీ- ప్రియా మధ్య మాటల యుద్దం జరుగగా లెటేస్ట్ ఎపిసోడ్‌లో త్రిమూర్తులు జెస్సీ-షన్ను- సిరి మధ్య ఎమోషన్ డ్రామా నడించింది.

బంగారు కోడిపెట్ట టాస్కులో ఎక్కువగా గుడ్లు సంపాదించి మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు కెప్టెన్సీ పోటీలోకి వచ్చారు. ఇక సీక్రెట్ టాస్కులో జెస్సీ దారుణంగా దెబ్బతిన్నాడు. ముగ్గురి దగ్గర ఎగ్స్‌ను జీరో చేయాలని చెప్పాడు. కానీ జెస్సీ మాత్రం ఆట ఆడకుండా వారిని రిక్వెస్ట్ చేసుకుని జీరో ఎగ్స్ ఉంచేలా చేశాడు. అలా ఆట ఆడుకుండా వారిని బతిమాలాడి ఒప్పించడంతో సీక్రెట్ టాస్క్ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేదని జెస్సీని కెప్టెన్సీ పోటీకి అనర్హుడిగా ప్రకటించాడు బిగ్ బాస్.

ఇక సిరి కూడా తన ఆటను పక్కన పెట్టేసి జెస్సీకి సాయం చేయగా సీక్రెట్ టాస్క్ కాస్త తుస్సుమంది. వీరిద్దరూ కలిసి తనను ఎదవను చేశారంటూ తెగ బాధపడిపోయాడు షన్ను. ఫ్రెండ్ అనుకుని నన్ను ఎదవను చేశారు.. నేను దేనికి పనికి రాను.. ఆట ఆడటం రాదు అని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అంటూ హర్ట్ అయ్యాడు.

షన్ను అన్న మాటలకు జెస్సీ కూడా హర్ట్ అయ్యాడు. షన్ను పక్కన ఉన్న బెడ్‌ను ఖాళీ చేసి వేరే బెడ్‌ను వెతుక్కున్నాడు. తర్వాత లోబో ఇంట్లోకి రావడంతో కథ మారిపోయింది. లోబో ఎంట్రీతో శ్రీరామచంద్రకు బ్లాక్ ఎగ్ ఇచ్చి కెప్టెన్సీ పోటీల్లోంచి తప్పించేశాడు. కాజల్‌కు గోల్డ్ ఎగ్ ఇచ్చి శ్రీరామచంద్ర స్థానంలో కెప్టెన్సీ పోటీదారునిగా నిలబెట్టాడు.

ఈ టాస్క్ వల్ల నువ్ ఎవరికి సపోర్ట్ చేస్తావో నాకు తెలిసిందంటూ సిరి మీద ఫైరయ్యాడు షన్ను. నీలాగా నటించడం రాదంటూ సిరిని ఫీలయ్యేలా చేశాడు. ఉదయాన్నే కాఫీ ఇచ్చినా తాగలేదు. మధ్యాహ్నం లంచ్ ఇచ్చినా తినలేదు.