కెప్టెన్‌గా అవినాష్..ఇంటి సభ్యులకు కఠిన రూల్స్‌!

137
avinash

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన జబర్దస్ అవినాష్ ఎట్టకేలకు ఏడవ వారంలో ఇంటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.అరియానా- అవినాష్ మధ్య జరిగిన పోటీలో ఆరుగురు సభ్యులు అవినాష్‌కు మద్దతివ్వడంతో కెప్టెన్‌గా నిలిచాడు.

ఇక కెప్టెన్‌గా ఎంపికవుతూనే తన మార్క్ క‌ఠిన రూల్స్ ప్ర‌వేశ‌పెట్టారు. తనతో పాటు పోటీలో ఉన్న అరియానాను ఓదారుస్తూ ఇంటి సభ్యుల మనసు గెలుచుకునేలా ఆమెను రేషన్ మేనేజర్‌గా ఎంపికచేశాడు. దీంతో అరియానాతో పాటు అంతా హ్యాపీగా ఫీలయ్యారు.

ఇక తర్వాత హౌస్‌లో కొత్త రూల్స్ ప్రవేశపెట్టాడు అవినాష్. ఎవరైనా మైక్ పెట్టుకోవడం మరిచిపోతే తీస్తూ పెట్టుకుంటున్నట్టు 100 సార్లు చేయాలని అన్నాడు. అలాగే, ఏ ఇంటి సభ్యుడైనా నిద్రపోవడం వల్ల రెండు సార్లు బౌ బౌ వస్తే కనుక రెండు సార్లు పూల్‌లో దూకాలని కండిషన్ పెట్టాడు. అలాగే, ఎవరైనా ఇంగ్లిష్‌లో మాట్లాడితే బిగ్ బాస్ ప్రతి కెమెరా దగ్గరకు వెళ్లి చిన్న పిల్లాడిలా లేదంటే చిన్న పిల్లలా ‘ఇంకోసారి ఇంగ్లిష్‌లో మాట్లాడను బిగ్ బాస్’ అని చెప్పాలన్నాడు. దీంతో ఇంటి సభ్యులంతా తమకు అవినాష్ పనిష్మెంట్ ఇస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.