బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 16 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. సోమవారం ఎపిసోడ్‌లో ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా గంగవ్వ జోష్,ఎవరిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేయాలనే దానిపై ఇంటి సభ్యుల మధ్య తీవ్ర చర్చ నడుమ 16వ ఎపిసోడ్ ముగిసింది.
తొలుతు ముక్కాబులా సాంగ్‌కి ఇంటి సభ్యులు అదిరిపోయే స్టెప్పులు వేశారు. గంగవ్వ సైతం డ్యాన్స్‌తో అలరించింది. ఇక అభిజిత్ అయితే మొనాల్ లేదా హారికతో పులిహోర కలిపే పనిలో బిజీగా ఉండగా మధ్యలో ఎంటరైన దివి ఆదివారం ఎలిమినేషన్‌పై చర్చ జరిపారు.
మొనాల్-హారికలలో నువ్ ఎవర్ని సేవ్ చేసేవాడివని అభిజిత్‌ని దివి అడడగా పక్కన హారిక ఉందని మొనాల్‌ని ఎలిమినేట్ చేసేవాడినని సమాధానం చెప్పాడు. ఇక మెహబూబ్ తనను నామినేట్ చేయడం పట్ల తెగ ఫీల్ అయిపోయింది హారిక. సిల్లీ రీజన్ చెప్పాడని నా ఇగోని హర్ట్ చేశాడంటూ ఫీల్ అయ్యింది.
ఇక అరియానా గ్లోరీతో దేవి గురించి చర్చించాడు రాజశేఖర్ మాస్టర్. నేను ఏ రోజు డైరెక్టర్ అని ఫీల్ అవ్వలేదు.. వృత్తి కోసం చర్చించాల్సిన అవసరం లేదని చెప్పాడు రాజశేఖర్. తర్వాత అరియానా-సొహైల్‌ల మధ్య టేబుల్ క్లీనింగ్ విషయంలో గొడవ రేగింది. ఆనియన్స్ కట్స్ చేసిన తరువాత టేబుల్ క్లీన్ చెయ్ అని అరియానా సొహైల్‌ని కోరడంతో సీరియస్ అయ్యాడు సొహైల్.తర్వాత కొత్త రేషన్ డీలర్‌గా అభిజిత్‌ను ఎన్నుకున్నారు ఇంటి సభ్యులు.
ఇక మూడోవారం ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. కరాటే కల్యాణి వెళ్తూ వెళ్తూ దేవిని నామినేట్ చేయగా కెప్టెన్ నోయల్ ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అధికారం ఇవ్వగా నోయల్…యాంకర్ లాస్యను నామినేట్ చేశాడు. ఇక మిగిలిన సభ్యులు ఇద్దరు కలిసి ఒకరిని నామినేట్ చేయాల్సిందిగా కోరారు బిగ్ బాస్.
అరియానా గ్లోరీ, హారిక కలిసి మెహబూబ్‌ను నామినేట్ చేయగా రాజశేఖర్,కుమార్ సాయి కలిసి దేవిని,మెహబూబ్,సుజాత కలిసి దేత్తడి హారిక, మొనాల్ గజ్జర్, కుమార్ సాయి కలిసి దివిని, మెహబూబ్, అఖిల్ సార్థక్ కలిసి కుమార్ సాయిని, కుమార్ సాయి, మొనాల్ గజ్జర్ కలిసి గంగవ్వను, అరియానా గ్లోరి, కుమార్ సాయి కలిసి రాజశేఖర్ మాస్టర్, అరియానా గ్లోరి, దివి కలిసి మొనాల్‌ని, కుమార్ సాయి, అరియానా గ్లోరి కలిసి అఖిల్ సార్థక్ ,అరియానా-కుమార్ సాయి కలిసి సొహైల్‌ని నామినేట్ చేశారు. ఇక అరియానా గ్లోరి, కుమార్ సాయి కలిసి లాస్యను,మొనాల్-మెహబూబ్ కలిసి అరియాను,దేత్తది హారిక-అభిజిత్ కలిసి జోర్దార్ సుజాతను నామినేట్ చేశారు.
మొత్తంగా మూడోవారంలో ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా ఇందులో దేవి,లాస్య,అరియానా,కుమార్ సాయి.మొనాల్,మెహబూబ్,హారిక ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుండి బయటకురానున్నారు.