మినీ స్టేడియంను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

276
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలసి పర్యటించారు. ఇందులో భాగంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

స్థానిక శాసన సభ్యులు అంజయ్య యాదవ్‌తో కలసి నందిగామలో 24 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్లను ప్రారంభించారు. అనంతరం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 9 లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని ప్రారంభోత్సవం చేశారు. వీటితోపాటు తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో 2 కోట్ల 10 లక్షల తో నిర్మించిన మినీ స్టేడియంను ప్రారంభించారు. అనంతరం షాద్ నగర్‌లో 1 కోటి 80 లక్షలతో నిర్మించిన వైకుంఠదామం ప్రహరీ గోడ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే సుమారు 50 మినీ స్టేడియంలో నిర్మాణం పూర్తి చేశామన్నారు.త్వరలోనే అన్ని స్టేడియం ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు.

క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం సాధించటానికి క్రీడా పాలసీని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. క్రీడా పాలసీ ఏర్పాటుపై వివిధ దేశాలలో ఉన్న క్రీడా పాలసీలను అధ్యయనం చేస్తున్నామన్నారు. మినీ స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కొద్దిసేపు షటిల్ ను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, zp చైర్మన్ అనిత రెడ్డి, Sats చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి లతో ఆడారు. ఈ కార్యక్రమంలో ZP ఛైర్మన్ తీగల అనిత రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -