బిగ్ బాస్ 4….ఎపిసోడ్ 15 హైలైట్స్

174
noel

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 4 విజయవంతంగా 15 ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పటివరకు హౌస్‌ నుండి ఇద్దరు కంటెస్టెంట్‌లు ఎలిమనేట్ కాగా ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చారు. నాగార్జున ఇచ్చిన సస్పెన్స్ చివరివరకు సాగడం. యాంకర్ దేవి ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వడం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

రెండో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణిని వేదికపైకి ఆహ్వానించారు నాగ్‌. ఈ సందర్భంగా మాట్లాడిన కళ్యాణి…బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని, తాను ఎలా ఉంటానో అలాగే హౌజ్‌లో ఉండాలని అనుకున్నానని.. అది జనానికి నచ్చినా నచ్చకపోయినా తనకు నచ్చిందని కళ్యాణి చెప్పుకొచ్చారు. మొదటివారమే ఎలిమినేట్ కావాల్సిందని కానీ రెండోవారం వరకు ఉండటం భగవంతుడి దయ అని చెప్పుకొచ్చింది.

ఇక చివరిగా వెళ్లే ముందు ఒక బోర్డుపై టాప్-5, బాటమ్-5 బ్లాక్‌లు ఇచ్చారు. కంటెస్టెంట్ల ఫొటోలను వాటిలో అమర్చాలని, కారణం కూడా చెప్పాలని కళ్యాణీకి నాగార్జున సూచించారు. బాటమ్-5లో సోహైల్ (5), సుజాత (4), అరియానా గ్లోరీ (3), కుమార్ సాయి (2), గంగవ్వ (1) ఫొటోలను కళ్యాణి అమర్చారు. టాప్ – 5లో దేత్తడి హారిక (1), ‘అమ్మ’ రాజశేఖర్ (2), మోనాల్ (3), దివి (4), అభిజిత్ (5) ఫొటోలను కళ్యాణి పెట్టారు.చివరగా వెళ్లేముందు హౌస్‌ నుండి ఎవరిని ఎలిమినేట్ చేస్తావని సూచించగా దేవి నాగవళ్లి పేరును సూచించారు. దీంతో నాగార్జున సైతం మూడోవారంలో ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యావని తెలిపారు నాగ్‌.

తర్వాత ఒక్కో బెలూన్‌పై పేర్లు ఉన్న కంటెస్టెంట్లకు బెలూన్లను అందజేసి గ్రీన్ వస్తే సేఫ్ అని, రెడ్ వస్తే డేంజర్ జోన్ ఉన్నట్లు అని తెలపగా అభిజిత్, సాయి కుమార్ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయారు. ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే హౌజ్‌మేట్స్‌తో డాగ్ అండ్ బోన్ గేమ్ ఆడించారు నాగార్జున. బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయాలి. పాట ఆగినవెంటనే బోన్‌ను తీసుకోవాలి. ఎవరైతే బోన్ తీసుకుంటారో వాళ్లు విన్నర్. ఓడిపోయిన వాళ్లకు పనిష్మెంట్ ఉంటుందని తెలిపారు.

()అఖిల్ – అభిజిత్ (అఖిల్ గెలిచాడు. అభిజిత్‌కు బస్కీలు తీసే పనిష్మెంట్ ఇచ్చారు.)
() దేత్తడి హారిక – మోనాల్ (మోనాల్ గెలిచింది. హారికకు పెదవులు అంటుకోకుండా మాట్లాడాలి అని పనిష్మెంట్ ఇచ్చారు.)
() సోహైల్ – మెహబూబ్ (మెహబూబ్ గెలిచాడు. గెలుపు కోసం ఇద్దరూ కుస్తీలు పట్టేశారు. పచ్చి ఉల్లిపాయ తినాలని సోహైల్‌కు పనిష్మెంట్ ఇచ్చారు.)
() దేవి – రాజశేఖర్ (దేవి గెలిచింది. నిజానికి రాజశేఖర్ వదిలేశారు. దీనికి పనిష్మెంట్ కింద రాజశేఖర్‌తో మిరపకాయ తినిపించారు)
()సుజాత – లాస్య (సుజాత గెలిచింది. లాస్యకు చిన్న పిల్లలా నటించే పనిష్మెంట్ ఇచ్చారు.)
()దివి – అరియానా (దివి గెలిచింది. అరియానాకు పోల్ డ్యాన్స్ చేసే పనిష్మెంట్ ఇచ్చారు. పూల్‌ను క్లీన్ చేసే నెట్ పోల్‌ను తీసుకొచ్చి రాజశేఖర్ మాస్టర్

డ్యాన్స్‌కు సెట్ చేశారు.)
() కుమార్ సాయి – గంగవ్వ (గంగవ్వ గెలిచారు. నోట్లో నీళ్లు పోసుకుని మింగకుండా పైసా వసూల్ పాట పాడాలని సాయికి పనిష్మెంట్ ఇచ్చారు.)
()అవినాష్ – నోయల్ (అవినాష్ గెలిచాడు. నోయల్‌కు పనిష్మెంట్‌గా అవినాష్ కళ్లు మూయించి ఆయనతో నోయల్‌కు లిప్‌స్టిక్ వేయించారు.)

ఈ గేమ్ మధ్యలో అమ్మ రాజశేఖర్ సేఫ్ అని ప్రకటించగా తర్వాత కెప్టెన్ నోయల్ కూడా సేఫ్ అయ్యారు. చివరగా హారిక, మొనాల్ ఇద్దరినీ నిలబెట్టి ఇంటిసభ్యులు ఎవరికి ఎక్కువ వాటర్ పోస్తేవారు ఎలిమినేట్ అయినట్టేనని తెలిపారు. దీంతో ఎక్కువ నీళ్లు దేత్తడి హారిక బీకర్‌లో రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్.

దేత్తడి హారిక ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే అందరూ ఏడుస్తూ ఆమెను సాగనంపేందుకు చివరివరకు తీసుకెళ్లారు. అయితే ఒక్కసారిగా హారికను పిలిచిన నాగ్‌…ఎలిమినేట్ కాలేదని ప్రకటించడంతో హౌస్‌లో సందడి మొదలైంది. హారిక సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని ఇదొక వార్నింగ్‌ అంటూ హెచ్చరించారు.