అక్టోబర్ నుండి ‘ఫైటర్’ షూటింగ్‌ షురూ..

164
Fighter

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఫైటర్. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇక ప్రభుత్వం తాజాగా సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో ఫైటర్ చిత్రబృందం మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టనుంది. అక్టోబర్ 10వ తేదీ నుండి హైదరాబాద్ లో నిర్మించిన ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఫైటర్‌ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమేకాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.