బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 12 హైలైట్స్

276
gangavva
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 12 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో గంగవ్వ కంటతడి పెట్టడం,వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.దేత్తడి హారిక బాయ్ ఫ్రెండ్స్ వెతుకులాటపై ఫోకస్ పెట్టింది. నీకు వేరే ఆప్షన్ లేదు.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లలోనే ఒక బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కోవాలి? లేదంటే బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు పంపము అంటే నువ్ ఎవర్ని సెలెక్ట్ చేసుకుంటావు? అంటూ సుజాతను అడిగింది హారిక.లాస్య,అభి కూడా తనను టార్గెట్ చేయడంతో మెల్లగా అక్కడినుండి జారుకుంది సుజాత.

తర్వాత సుజాత.. నోయల్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ నీకు నాకు మధ్య ఏదో ఉంది అంటూ అనుకుంటున్నారు.. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అనడంతో.. నోయల్ నిన్ను సిస్టర్‌లా చూస్తున్నా వాళ్లను పట్టించుకోవద్దు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా జబర్దస్త్ హౌస్‌లోకి ఎంటరై అందరితో ఇట్టే కలిసిపోయాడు.

వచ్చీ రావడంతోనే మొనాల్ దగ్గరకు వెళ్లి నేను నీకు పెద్ద ఫ్యాన్‌ని అని ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి తెగ ప్రయత్నించాడు. నా గురించి ఆలోచించాలని మొనాల్‌ని కోరాడు. తర్వాత అభిజిత్- అఖిల్ మధ్య గొడవ జరగగా మొనాల్ దగ్గరకు వెళ్లి తన బాధను వ్యక్తం చేశాడు అఖిల్. సీన్ కట్ చేస్తే తనను అభిజిత్ చెల్లి అని పిలవడంపై తెగ ఫీల్ అయ్యింది సుజాత. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్, కుమార్ సాయిలు రెండు టీంలుగా విడిపోయి కామెడీ స్కిట్‌లు చేయాలని.. మిగిలిన సభ్యులు స్కిట్ మధ్యలో యాడ్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

గంగవ్వకు ఆరోగ్యం బాలేకపోవడంతో కన్వెషన్ రూంకి పిలిచారు బిగ్ బాస్. దీంతో ఒక్కసారిగా గుండెపగిలేలా ఏడ్చేసింది గంగవ్వ. తల్లి,తండ్రి, భర్తలేని నన్ను వీళ్లు బాగానే చూసుకుంటున్నారు….రెండు నెలలు ఉందాం అని వచ్చాకాని ఆరోగ్యం సహకరించడం లేదని ఏడ్చేసింది. భర్త కొట్టిన దెబ్బలు.. రెస్ట్ లేక పాత నొప్పులు మళ్లీ బాధపెడుతున్నాయని ఇక్కడ వాతావరణం పడటం లేదు మీ కాళ్లు మొక్కుతా బిగ్ బాస్ నేను వెళిపోతా అంటూ కన్నీరు

మున్నీరైంది గంగవ్వ. మీ ఆరోగ్యం విషయంలో బాధపడకండి.. అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది.. మిమ్మల్ని చూసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు అంటూ ధైర్యం చెప్పిం పంపించారు బిగ్ బాస్. తర్వాత లాస్య…గంగవ్వను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -