బిగ్ బాస్ 4….అప్పుడు సంపూ ఇప్పుడు గంగవ్వ!

198
sampoornesh

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 12 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇక 12వ ఎపిసోడ్‌లో బిగ్ హౌస్ నుండి వెళ్లిపోతానన్న గంగవ్వ సీజన్‌ 2లో సంపూని గుర్తుచేసింది. ఇద్దరు విలేజ్ బ్యాక్ డ్రాప్ నుండి రావడం తర్వాత వారిని ఎవరో బంధించినట్లు అనిపించిన ఫీలింగ్‌తో తాము హౌస్‌ నుండి వెళ్లిపోతామని బిగ్ బాస్ ముందు కంటతడి పెట్టుకున్నారు.

గతంలో రెండోవారంలోనే సంపూ తాను హౌస్‌లో ఉండలేనని తన మనస్తత్వానికి ఇక్కడ సరిపోవడం లేదని ఇక్కడే ఉంటే పిచ్చివాడిని అయిపోతానని బోరున విలపించగా ఆ వారంలోనే సంపూను బయటకు పంపించారు బిగ్ బాస్.

తాజాగా సీజన్‌ 4లో తన వయసు దృష్ట్యా ఇక్కడ ఉండలేకపోతున్నానని కన్నీరు మున్నీరుగా విలపించింది గంగవ్వ. ఇక్కడ రెండు నెలలు ఉందాం అని వచ్చాకాని.. ఒళ్లు బాగా నొప్పులుగా ఉన్నాయని.. కళ్లు చాలా బాధ పెడుతున్నాయని ఏడ్చేసింది.భర్త కొట్టిన దెబ్బలు.. రెస్ట్ లేక పాత నొప్పులు మళ్లీ బాధపెడుతున్నాయని.. ఇక్కడ వాతావరణం నాకు పడటం లేదని తనను పంపించాలని కోరింది. మరి గంగవ్వను బిగ్ బాస్ హౌస్‌లో ఉంచుతారో లేక.. ఆమె కోరిక మేరకు బయటకు పంపిస్తారో వేచిచూడాలి.