హారిక-మాస్టర్-అభి!

256
harika
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో భాగంగా బీబీ కేర్ టాస్క్‌లో చిన్న‌పిల్లల్లా మారిన కంటెస్టెంట్లు దాగుడు మూత‌లు ఆడుకున్నారు. త‌ర్వాత మాస్ట‌ర్ జేబులో నుంచి హారిక చాక్లెట్‌ కొట్టేసింది. దీంతో మాస్టర్‌తో పాటు అత‌డి కేర్ టేక‌ర్ అభిజిత్ కూడా కోపానికి వ‌చ్చాడు. చాక్లెట్ పోయింద‌ని మాస్ట‌ర్ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అంద‌రిమీద కోపంతో కేక‌లేశాడు. చివ‌రికి హారిక త‌నే స్వ‌యంగా వెళ్లి ఆయ‌న‌తో మాట్లాడి సారీ చెప్పినా అత‌డు కూల్ అవ‌లేదు.

రాజశేఖర్‌ మాస్టర్‌ని ఆట పట్టించడంలో భాగంగా చాక్లెట్స్ తీసుకుని తన చెడ్డీ చేబులో వేసేసుకుని పారిపోతుండగా ఆమెను పట్టుకుని కింద దొర్లించి మరీ చెడ్డీ జేబులో చేయిపెట్టి చాక్లెట్ తీసి నేలకేసి కొట్టేశారు రాజశేఖర్ మాస్టర్. ఆమె ఎంత అరుస్తున్న పట్టించుకోలేదు. తర్వాత అంతా మాస్టర్‌ని తప్పుబట్టగా హారిక.. ఒక మహిళ అయ్యి ఉండి.. నా బేబులో చేయిపెట్టి చాక్లెట్ తీసేసింది.. అది తప్పుకాదు.. నేను తిరిగి అలాగే తీసుకుంటే తప్పు అంటున్నారు.. అంటూ సీరియస్ అయ్యారు.

ఇక తర్వాత అభిజిత్ కూడా హారికపై సీరియస్ అయ్యాడు. పాకెట్‌లో నుంచి తీసుకోవ‌డం లాక్కోవ‌డ‌మా? దొంగ‌త‌న‌మా అని అభి ప్ర‌శ్నించాడు. అది దొంగ‌త‌న‌మే అని క్లారిటీ ఇచ్చిన హారిక ఆ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే మాట్లాడ‌క‌పోయావేన‌ని తిరిగి ప్ర‌శ్నించింది. దీంతో కోపం వచ్చిన అభిజిత్.. నేనెప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్ప‌కు. ఏం మాట్లాడుతున్నావు? నాకు న‌చ్చిన‌ప్పుడే చెప్తాన‌ని సీరియ‌స్ అయ్యాడు. దీంతో హారిక అత‌డికి క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ఇంకోసారి అలా చేయ‌నంటూ వెల్లిపోయి ఈ గొడ‌వ‌కంత‌టికీ మూల‌కార‌ణ‌మైన‌ చాక్లెట్‌ను మాస్ట‌ర్‌కు తిరిగిచ్చేసింది.

- Advertisement -