బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 53 హైలైట్స్

45
akhil

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 53 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాయి. బుధవారం ఎపిసోడ్‌లో భాగంగా బీబీ డే కేర్ టాస్క్‌,మాస్టర్-హారిక మధ్య అరాచకం,అఖిల్ గెలవడం వంటి వాటితో ఎపిసోడ్ ముగిసింది.

రాజశేఖర్‌ మాస్టర్‌ని ఆట పట్టించడంలో చాక్లెట్స్ తీసుకుని తన చెడ్డీ చేబులో వేసుకుని పారిపోతుండగా ఆమెను పట్టుకుని మరీ చెడ్డీ జేబులో చేయిపెట్టి చాక్లెట్ తీసి నేలకేసి కొట్టారు మాస్టర్‌. హారికా.. సైకో.. అంటూ సీరియస్ అయ్యాడు. హారిక ఒక మహిళ అయ్యి ఉండి.. నా బేబులో చేయిపెట్టి చాక్లెట్ తీసేసింది.. అది తప్పుకాదు.. నేను తిరిగి అలాగే తీసుకుంటే తప్పు అంటున్నారు మండిపడ్డారు.

ఆయన పాకెట్‌ నాకు అనుకూలంగా ఉంది తీసేశా.. కానీ నా పాకెట్లో చేయి పెట్టొద్దని నేనేం చెప్పలేదు అంటూ లాస్య, మోనాల్‌లతో వాదించింది హారిక. అరియానా….మాస్టర్‌తో మీరు మంచి వారు కాకపోయిన పర్లేదు మాస్టార్.. అలా చేబులో చేయిపెట్టొద్దు చెడ్డవారు కావద్దు అంటూ తెలిపింది. తర్వాత హారిక తిరిగి మళ్లీ రాజశేఖర్ మాస్టర్ దగ్గరకు వెళ్లి సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది.

వీళ్ల రచ్చపై లాస్య, నోయల్, అభిజిత్ గ్రూపు చర్చ మొదలుపెట్టారు. ఇక ఈ గొడవ అంతటికీ కారణం అయిన హారిక వచ్చి నేను చెప్పేది వింటారా? అంటూ ఇంగ్లీష్ పాఠం మొదలుపెట్టింది. పాకెట్‌లో నుంచి తీసుకోవడం అంటే ఏంటి?? దొంగతనమా.. లాక్కోవడమా? అని అడిగాడు అభిజిత్. నా దృష్టిలో అయితే దొంగతనమే.. లాక్కోవడం కాదు.. అయినా నువ్ అప్పుడే మాట్లాడాలి అభి అంటూ హారిక చెబుతుండగా చిర్రెత్తుకొచ్చిన అభి..నేను ఎప్పుడైనా మాట్లాడతా.. నువ్ నాకు నేర్పకు.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డాడు.

నోయ‌ల్‌కు ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో అవినాష్‌కు కూడా అభిజితే కేర్ టేక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. బిగ్‌బాస్ కూడా అనారోగ్యం కార‌ణంగా నోయ‌ల్‌కు విశ్రాంతి క‌ల్పించాడు. త‌ర్వాత బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌తో స‌ర‌దాగా నేల‌, నీళ్లు, మంట ఆడించారు. ఈ టాస్క్‌లో అభి కాళ్లు జారి కింద‌ప‌డ‌గా అఖిల్‌ గెలిచాడు.ఈ టాస్క్‌లో విన్న‌ర్ జోడీని ఎంపిక చేయ‌మ‌ని లాస్య‌ను ఆదేశించ‌గా ఆమె సోహైల్‌-అరియానా పేర్ల‌ను వెల్ల‌డించింది. దీంతో బిగ్‌బాస్ వారికి స్పెష‌ల్ గిఫ్టులు పంపారు.