బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 24 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇక నాలుగోవారంలో ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా 24వ ఎపిసోడ్లో అభిజిత్- సోహెల్ మధ్య యుద్దవాతావరణం నెలకొంది.
గత వారం జరిగిన ఉక్కు హృదయం టాస్క్‌పై అభి-సొహైల్‌ల మధ్య చర్చ రచ్చకు దారితీసింది. మమ్మల్ని గల్లీ బాయ్స్ అంటే ఊరుకోవాలా?? అని సొహైల్ అనడంతో.. నీ బతుకు అని నన్ను అనలేదా?? అంటూ అభి అడిగాడు. ఇవ్వవా?? ఫిజికల్ టాస్క్ వస్తే కొట్టినా కొడతావా? అనడంతో కొట్టను కానీ ఫిజికల్ టాస్క్ ఇస్తే కాలర్ పట్టుకుని పక్కకు లాగే అవసరం వస్తే ఖచ్చితంగా అలాగే చేస్తా అన్నాడు సొహైల్.
ఆడ పిల్లలతో గీకించుకున్నావ్ అంటూ సోహైల్‌ని అభి ప్రశ్నించగా అమ్మాయిలతో ఆట ఆడించి చార్జింగ్ పెట్టించుకున్నావ్… కాస్త మగాడిలా ఆట ఆడు అంటూ సీరియస్ అయ్యాడు సొహైల్.
ఆడవాళ్లతో గీకించుకున్నవాడు మగాడా..? కండలు చూపిస్తే మగాడా?? బుర్ర కూడా వాడు అంటూ అగ్నికి మరింత ఆజ్యంపోశాడు అభి. దీంతో అభికి ఘాటుగానే రిప్లై ఇచ్చాడు సోహైల్. నీకు దమ్ము లేదు నువ్ రాలేదు.. నేను నూటికి నూరు శాతం మగాడ్ని అలాగే ఆడతా అని తెలిపాడు. ఫిజికల్ టాస్క్ అంటే భయమా?.. బిగ్ బాస్ అభికి ఫిజికల్ టాస్క్ ఇవ్వకండి అంటూ అక్కడినుండి వెళ్లిపోయాడు సొహైల్.