గాంధీ జయంతికి బొమ్మ బ్లాక్‌బస్టర్

276
srivhishnu

టాలీవుడ్ న‌టులు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఫ్యాన్‌గా నందు కనిపించనుండగా ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్‌కి మంచిరెస్పాన్స్ వచ్చింది.

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా టీజర్‌ని రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్‌. హీరో శ్రీవిష్ణు అక్టోబర్ 2 ఉదయం 10.30కు రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలోని పోతరాజు క్యారెక్టర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చారు శ్రీవిష్ణు.

పోతురాజు గాడి ల‌వర్ వాణిగా ర‌ష్మీ గౌత‌మ్ నటిస్తుండగా విజయిభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నారు.