తిమింగలం కడుపులో 10 కోట్లు విలువ చేసే పదార్థం..

313
- Advertisement -

పశ్చిమ యెమన్ మత్స్యకారుల ఓ తిమింగలం కోటీశ్వరులను చేసింది. పశ్చిమ యెమెన్‌కు చెందిన 35 మంది జాలర్లు రోజూలానే సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఎప్పుడూ వాళ్లు చేపలను పట్టుకొని తెల్లారేసరికి ఇంటికి వెళ్తుంటారు. అయితే సముద్రంలో తిమింగలాలు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. వారు వెళ్తున్న పడవకు ఒక్కసారిగి భారీ వస్తువు ఏదో తగిలి ఒక్కసారిగి పడవలో అలజడి ఏర్పడింది. వారు ఒక్కసారిగా భయపడ్డారు. ఏదైనా ఇసుక మేట తగిలిందేమోనని అనుకున్నారు. అంతా ఒకదగ్గరుకు వచ్చి ఏమై ఉంటుందో అని చూశారు. చనిపోయిన ఓ స్పెర్మ్‌ తిమింగలం వారి పడవకు ఎదురుపడింది. ఆ తిమింగల కళేబరమే జాలర్లను కోటీశ్వరులని చేసింది.

సాధారణంగా తిమింగలాలు చనిపోతే సముద్రం గర్భంలోనే కలిసిపోతాయి. కానీ ఓ భారీ తిమింగలం కళేబరం మాత్రం సముద్రంలో తేలియాడుతూ జాలర్లకు కనిపించింది. దానిని 35 మంది జాలర్లు ఆ కళేబరాన్ని ఎంతో కష్టబడి ఒడ్డుకు తీసుకొచ్చారు. అలా వారు ఒడ్డుకు తీసుకురావడమే వారిని కోటీశ్వరులని చేసింది. ఒడ్డుకు తీసుకొచ్చిన తిమింగలం శరీరాన్ని కోయగా ‘వేల్‌ వొమిట్‌ లే’ అని పిలిచే వస్తువు వారికి దొరికింది. ఆ పదార్థాన్ని ‘అంబగ్రీస్‌’ అని పిలుస్తారు.

సాధారణంగా తిమింగలం ఉమ్మినప్పుడో, వాంతి చేసుకున్నప్పుడో ఈ పదార్థం బయటికి వస్తుంటుంది. ఈ అంబగ్రీస్‌తో తయారుచేసిన సుగంధ ద్రవ్యాలకు భారీ డిమాండ్ ఉంటుంది. దీనితో తయారుచేసిన సెంటు ఒక చిన్న బాటిల్ కూడా లక్షల్లో ధర పలుకుతుంది. అందుకే సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లు ఈ అంబగ్రీస్‌ను అదృష్టదేవతగా భావిస్తుంటారు.

ఈ నేపథ్యంలో, తమ కంటబడిన ఆ స్పెర్మ్ వేల్ కళేబరాన్ని జాలర్లు కత్తులతో చీల్చి చూడగా, వారు ఊహించినట్టే దాని పొట్టలో అంబగ్రీస్‌ పదార్థం కనిపించింది. దాన్ని మార్కెట్ వర్గాలకు చూపించగా, రూ.10 కోట్ల విలువ చేస్తుందని వారు తెలిపారు. దాంతో ఆ యెమెన్ మత్స్యకారుల ఆనందం అంతాఇంతా కాదు. ఈ మొత్తాన్ని వేటకు వెళ్లిన 35 మంది జాలర్లు పంచుకోనున్నారు.

గతంలో అంబగ్రీస్‌ లు బయట పడిన సందర్భాలు ఎన్నో వెలుగు చూశాయి. గత ఏడాది డిసెంబర్లో కూడా ఒక జాలరికి సుమారు 100 కేజీల అంబగ్రీస్‌ దొరికింది. దక్షిణ థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి తమ్మారత్ బీచ్‌లో నడుస్తున్నప్పుడు అతడు దాన్ని గుర్తించాడు. ఇప్పటి వరకు వెలుగు చూసిన అతిపెద్ద అంబగ్రీస్‌ లలో ఇది ఒకటి కావడం విశేషం.

అంబగ్రీస్‌ ను తేలియాడే బంగారం లేదా సముద్రపు నిధి అంటారు. స్పర్మ్ వేల్ జాతి తిమింగళాల జీర్ణ వ్యవస్థ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది తిమింగళాల జీర్ణాశయంలోకి పదునైన వస్తువులు సులభంగా వెళ్లేలా, అవి జీర్ణమయ్యేలా చేస్తుంది. ఈ స్రావాలు బయటకు వచ్చిన తరువాత గడ్డకట్టుకుపోతాయి. మొదట్లో ఇవి దుర్వాసనను కలిగి ఉంటాయి. కానీ పూర్తిగా ఎండిపోయిన తరువాత సువాసనలు వెదజల్లుతుంది. అందుకే దీనికి సౌందర్య ఉత్పత్తుల్లో, పెర్ఫ్యూమ్ పరిశ్రమలో దీనికి మంచి విలువ ఉంటుంది.

- Advertisement -