జనసేనకు గుడ్‌ బై చెప్పిన కీలక నేత..

432
- Advertisement -

జనసేనకు మరో షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత అనేకమంది కీలక నేతలు జనసేన పార్టీకి రాజీనామాలు చేశారు. తాజాగా మరో సీనియర్ నాయకుడు జనసేనకు తిలోదకాలు ఇచ్చేశారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా జనసేన తరఫున పోటీచేసిన చింతల పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పారు.

pawankalyan

పార్థసారథి తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్‌కు పంపారు. పార్థసారథి ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆయనకు చాలా తక్కువ శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పార్థసారథిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఎంతో నమ్మకం ఉంచి ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు.

అయితే కొంతకాలంగా పార్థసారథి పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి, మానిటరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా,పార్థసారధి ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ మొదలయ్యింది.

- Advertisement -