భారీగా పెరిగిన ఉల్లి-టమాటా ధరలు..

646
Tomato Prices
- Advertisement -

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఎప్పుడూ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఉల్లి,టమాట ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయ,టమాట లేకుండా పూటగడవదు. ఇప్పుడు వాటి ధరలు విపరీతంగా పెరిగి ఉల్లి కోయకుండానే కంట నీరు తెప్పిస్తోంది. తాజాగా టమాటా కూడా అదే బాటలో నడుస్తోంది.

సుమారు నెల రోజుల క్రితం కిలో ధర రూ. 20నుంచి రూ.25 ఉన్న ఉల్లి ఇప్పుడు రూ.100కి పెరిగింది. ఇక టమాటా విషయానికొస్తే.. నిన్న మొన్నటిదాకా కిలో రూ.10కే దొరికిన టమాటా ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. మార్కెట్లో ఏకంగా రూ.50 దాకా ధర పలుకుతోంది. దీంతో టమాటాలు కొనడానికి సామాన్యుడు ఆలోచిస్తున్న పరిస్థితి. కూరగాయల ధరలు ఇంతలా పెరిగిపోతే ఇంకేం తిని బతుకుతామని సగటు జనం వాపోతున్నారు.

Tomato Prices

అయితే వీటి ధరలు పెరగడానికి కారణం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే.. ఈ వర్షాల కారణంగా కాయ, పూత రాలిపోయి దిగుబడి ఒక్కసారిగా తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి దిగుమతి అవుతున్న టమాటాలే హైదరాబాద్‌ అవసరాలను తీరుస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మరో వారం రోజుల్లో దిగుబడి పెరిగే అవకాశం ఉందని, అప్పటి వరకు ధరలకు కళ్లెం వేయడం కష్టమని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -