తెలుగు బిగ్ బాస్ 3కి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సక్సెస్ పుల్ గా రెండు ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈషో తర్వలోనే మూడో షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈలిస్ట్ లో పలువురి పేర్లు కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా వెలుగు వెలిగిన ఉదయ భాను ఈషోలో పార్టీసిపెట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఉదయభాను ఈషోకు అట్రాక్షన్ గా నిలవనుందని చెబుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.
అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈషోలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు యూ ట్యూబర్ జాహ్నవి దాసెట్టి, నటి శోభితా దూళిపాళ, గద్దె సింధూర, టీవీ నటుడు జాకీ తోట, నటులు వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, మనోజ్ నందం, డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిలో వాస్తవం ఎంటో తెలియాలంటే మరొ కొద్ది రోజులు ఆగాల్సిందే.