బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే..

508
Big-Boss-3-Promo
- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే బిగ్ బాస్ 3 సీజన్ ను కూడా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించని ఏర్పాట్లను పూర్తి చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే బిగ్ బాస్ 3కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ లు ఎవరా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

రోజుకి ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. తాజాగా వచ్చిన లిస్ట్ ఫైనల్ అంటూ ప్రచారం జరుగుతుంది. అనధికార సమాచారమే అయినప్పటికీ, వీరే హౌస్ లోకి వెళ్లబోయే పోటీదారులట. వారిలో టాప్ యాంకర్ శ్రీముఖి, తీన్ మార్ వార్తలతో దుమ్ము రేపుతున్న జ్యోతి అలియాస్ సావిత్రి, టాలీవుడ్ లవర్ బాయ్, ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన తరుణ్, తన స్టెప్పులతో అదరగొట్టే డ్యాన్స్ మాస్టర్ రఘు, బేస్ వాయిస్ తో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన సింగర్ హేమచంద్ర ఈ సీజన్ లో పోటీదారులుగా ఉంటారట.

వీరితో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టాప్ యాంకర్ ఉదయభాను, నటుడు వరుణ్ సందేశ్, కమేడియన్ వైవా హర్ష, యాంకర్ లాస్య కూడా ఉంటారట. ఇదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ‘మహాతల్లి’ ఫేమ్ జాహ్నవి కూడా హౌస్ లో ఉంటారని తెలుస్తోంది.

- Advertisement -