ప్రధాని మోదీ ధ్యాన గుహ ప్రత్యేకతలు

365
narendra modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండురోజుల క్రితం ఉత్తరాఖండ్ లోని కేదారినాథ్ ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. అయితే అక్కడే ఉన్న ఓ గుహను సందర్శించిన మోదీ అక్కడ కాసేపు గడిపి థ్యానం చేసి వెళ్లిపోయారు. ఇక మోదీ ఆ గుహలో గడిపి వెళ్లడంతో చాలా మంది పర్యాటకులు గుహను చూడటానికి ఆసక్తి చూపుతున్నారట. ఆ గుహకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ గుహను ‘ఆధునిక ధ్యాన గుహ’ లేదా ‘రుద్ర గుహ’ అని పిలుస్తారు. ఆ గుహలో ఇద్దరు కొంచెం కష్టంగా, ఒక్కరు హాయిగా పడుకునేందుకు ఓ మంచం, ఆ మంచం మీద ఓ మెత్తటి పరుపు ఉంటుంది. పగటి పూట ప్రకృతి అందాలను తిలకించేందుకు మంచం పక్కనే ఓ కిటికీ కూడా ఉంది.

rudra-cave2

గుహకు మరోపక్కన స్నానం చేసేందుకు కుళాయితో కూడిన సదుపాయం, మరో పక్కన టాయిలెట్‌ సౌకర్యం ఉంది. ఆలయానికి సరిగ్గా కిలోమీటరు దూరంలో ఈ గుహ ఉంది. గుహ పొడవు ఐదు మీటర్లు, వెడల్పు మూడు మీటర్లు ఉంది. ఇందులో 24గంటల కరెంట్ తో పాటు టెలిఫోన్ సౌకర్యం కూడా ఉంది. అక్కడున్న గంట కొట్టగానే 24 గంటలపాటు అందుబాటులో ఉండే అటెండర్‌ వస్తాడు. ఉదయం తేనీరు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్‌ సరఫరా చేస్తారు.

ఈగుహను నిర్మించేందుకు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఖర్చయిందట. ఇంతకుముందు ఈ రుద్ర గుహను కనీసంగా మూడు రోజులపాటు బస చేసేలా మూడువేల రూపాయలకు అద్దెకు ఇచ్చేవారు. పర్యాటకులు ఒక్క రోజుకు మించి ఇక్కడ ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడక పోతుండడంతో ఇటీవల రోజువారి ప్యాకేజీని ప్రవేశపెట్టారు. టీ, టిఫిన్, భోజన సదుపాయాలతో రోజుకు 990 రూపాయలను ఛార్జి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఈ గుహలోనే పడుకొని ఆదివారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఆయన మొత్తం ఈ గుహలో 17 గంటలపాటు గడపారు.

- Advertisement -