బిగ్ బాస్ 3 తెలుగు రియాల్టీ షో 89 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని 90వ ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. హోటల్ టాస్క్‌ను సక్సెఫుల్‌గా పూర్తి చేయడంతో ఒక్కో కంటెస్టెంట్‌కి 200 చెప్పున ఏడుగురుకి 14 వందల పాయింట్స్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే కండీషన్స్ పాటించని కారణంగా లగ్జరీ బడ్జెట్ పాయింట్ సున్నా ఇచ్చి పెద్ద షాక్ ఇచ్చారు .
ఈవారం టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో నేర్చుకున్న విషయాలపై గ్రాఫ్ గీయాల్సిలనే టాస్క్ విధించగా తొలుత వితిక తాను సినిమాల్లోకి ఎలా వచ్చానో తెలిపింది. సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభమైందని తర్వాత చార్మి హీరోయిన్గా తెరకెక్కిన సుందరకాండలో చిన్నరోల్ చేశానని తెలిపింది. తర్వాత ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే కన్నడ వెర్షన్లో కలర్స్ స్వాతి క్యారెక్టర్ చేశానని…తర్వాత తమిళ్లో కూడా చేయడంతో వరుణ్ సందేశ్‌తో సినిమా ఛాన్స్ వచ్చిందిదని తెలిపింది. వరుణ్‌తో చాలా హ్యాపీగా ఉన్నామని 13 వారాల బిగ్ బాస్ జర్నీ చాలా సంతోషంగా ఉందన్నారు. బిగ్ బాస్ తరువాత ఓ మంచి యాంకర్‌గా సెటిల్ అవ్వాలని ఉందని వెల్లడించింది.
తర్వాత ఎంట్రీ ఇచ్చిన బాబా బాస్కర్…తన కుటుంబ నేపథ్యం,డ్యాన్స్ నేర్చుకోవడానికి గల కారణాలను వివరించారు. హీరో ధనుష్ తన స్కూల్ ఫ్రెండ్ అని ఇద్దరం కలిసి చదువుకున్నామని చెప్పారు. ధనుష్‌తో తనకు ఎప్పడు గొడవ జరిగేదని కానీ అవేమి పట్టించుకోకుండా కొరియోగ్రాఫర్‌గా తనకు లైఫ్ ఇచ్చారని చెప్పారు. తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాని తెలిపారు. తర్వాత శివజ్యోతి తన పెళ్లి ఎలా జరిగింది ..యాంకర్ ఎలా అయ్యింది విషయాలను తెలిపారు.